ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Corona positive: మానుకోటలో కరోనా కలకలం.. 15మంది విద్యార్థులకు పాజిటివ్‌

ABN, First Publish Date - 2023-04-06T18:42:03+05:30

మహబూబాబాద్‌ జిల్లా (Mahbubabad District) కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా (Mahbubabad District) కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ (Corona positive) అని తేలింది. గుట్టుచప్పుడు కాకుండా వారిని ఐసోలేషన్‌ (Isolation) గదిలో ఉంచి వైద్య సేవలు ప్రారంభించారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. జిల్లాకు చెందిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, జిల్లా కలెక్టర్‌ శశాంక, వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు. మహబూబాబాద్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల (6,7,8,9,10, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ)లో 378 మంది విద్యార్థులు ఉండగా ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు కాగానే వారి.. వారి స్వగృహాలకు వెళ్లిపోయారు. పదో తరగతి చదువుతున్న 66 మంది విద్యార్థులు రెడ్యాల ఆశ్రమ గురుకుల పాఠశాలలో పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. మిగతా 252 మంది విద్యార్థులు గిరిజన సంక్షే మ గురుకుల బాలుర పాఠశాలలో ఉంటున్నారు. కాగా, గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో విద్యా ర్థులు, సెక్యూరిటీ గార్డ్‌ బాధపడుతున్నారని తెలుసుకున్న ఏఎన్‌ఎం వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ నెల 1న కొందరికి కరోనా ఆర్‌టీపీసీ టెస్టులు (RTPC Tests) నిర్వహించగా, ఒక సెక్యూరిటీగార్డు, మరో విద్యార్థికి పాజిటివ్‌ రావడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలు ప్రారంభించారు. ఆ తర్వాత మరికొంత మంది విద్యార్థులు ఇదే రీతిన అనారోగ్యానికి గురికావడంతో 51 మందికి ఆర్‌టీపీసీ పరీక్షలు చేయించారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌ రిపోర్టు 4వ తేదీన వచ్చింది. వీరందరిని గురుకులంలోనే ఓ గది (ఐసోలేషన్‌)లో ఉంచి పౌష్టికాహారం, మందులు ఇవ్వడం ప్రారంభించారు. గురుకుల నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. దీంతో పలువురి బంధువులు గురుకులానికి చేరుకుని పిల్లలను తీసుకువెళ్తామని కోరడంతో బుధవారం 12 మంది విద్యార్థులకు ఐదురోజులకు సరిపడ మందులు, మాస్కులు ఇచ్చి పంపించారు. మిగిలిన ముగ్గురు గురుకులం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 6వ తేదీ వరకు 28 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఆందోళన చెందవద్దు: సత్యవతి రాథోడ్‌

గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో కరోనా పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని మంత్రి సత్యవతి రాథోడ్‌ (Satyavathi Rathore) సూచించారు. ఐసోలేషన్‌లో ఉన్న విద్యార్థులకు మెరుగైన చికిత్సనందిం చాలని జిల్లా కలెక్టర్‌ శశాంక, డీఎంఅండ్‌హెచ్‌వో, ఆర్సీవో, సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికా హారం, మెడిసిన్‌ అందిస్తున్నామని, విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

Updated Date - 2023-04-06T18:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising