ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Abhaya hastam: జిరాక్స్‌ కాపీ రూ.40.. డౌన్‌లోడ్‌ చేసి ఇస్తే రూ.100

ABN, Publish Date - Dec 29 , 2023 | 12:44 PM

రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం(Abhaya hastam) పథకం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు గురువారం నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జిరాక్స్‌, నెట్‌ నిర్వాహకులకు కాసులను కురిపించింది.

- అభయ హస్తం ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తుల కొరతతో పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం(Abhaya hastam) పథకం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు గురువారం నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జిరాక్స్‌, నెట్‌ నిర్వాహకులకు కాసులను కురిపించింది. మలక్‌పేట, ఎల్బీనగర్‌, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజునే అభయ హస్తం పథకాల దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. దీంతో అర్హులైన వారు దరఖాస్తు ఫారాల కోసం ఎగబడ్డారు. మలక్‌పేట నియోజకవర్గం(Malakpet Constituency)లోని చావునీ, ఆజంపుర, ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌లోని పలు ప్రాంతాలతోపాటు, ఎల్బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాల్లో కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే దరఖాస్తు ఫారాల కోసం ఎగబడ్డారు. వాటి పంపిణీ ప్రారంభమైన కొద్ది సేపటికే దరఖాస్తులు అయిపోయాయని సిబ్బంది చెప్పడంతో అప్పటికే క్యూలో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్న ఆలోచనతో చేసేది లేక ఫారాలను జిరాక్స్‌ చేయించుకోవడానికి ఎగబడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకున్న నెట్‌ నిర్వాహకులు, జిరాక్స్‌ కేంద్రాల నిర్వాహకు లు దరఖాస్తు ఫారం సెట్‌ను జిరాక్స్‌ చేసేందుకు రూ.40లు వసూలు చేయ గా నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసేందుకు రూ.100లు వసూలు చేశారు. ఆజంపుర డివిజన్‌లోని కమల్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌ కేంద్రానికి వచ్చిన వారంతా జిరాక్స్‌ దరఖాస్తు ఫారాల కోసం జిరాక్స్‌ సెంటర్లకు ఎగబడ్డారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారు జిరాక్స్‌ కాఫీలను పెడుతున్న విషయాన్ని గమనించిన ఇన్‌చార్జి రమేష్‌ వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో అప్పటి వరకు జిరాక్స్‌ తీసిన దరఖాస్తు ఫారం రూ.40లు, నెట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసిన కాఫీలు రూ.100లు పలకగా వీటిని అధికారులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని చెప్పడంతో ఒక్కమారు వాటి ధర రూ.10లకు పడిపోయింది. చంచల్‌గూడ, చావునీ, ఆజంపుర, ఓల్డ్‌మలక్‌పేట, సలీంనగర్‌, సరూర్‌నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట ప్రాంతాల్లోని జిరాక్స్‌ షాపులు కిటకిటలాడాయి. దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడిన విషయాన్ని ప్రభుత్వం జిరాక్స్‌ కాఫీలు కూడా చెల్లు బాటవుతాయని చేసిన ప్రకటనతో వాటి ధర రూ.10లు కొనసాగింది.

ఓల్డ్‌మలక్‌పేటలో దరఖాస్తు ఫారాల కొరత

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన గురువారం ఓల్డ్‌మలక్‌పేటలోప్రారంభమైంది సంబంధిత అదికారులు సిబ్బంది ప్రజల నుంచి దరఖాస్తు లు తీసుకున్నారు. మొత్తం నాలుగుచోట్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు. అఫ్జల్‌నగర్‌ రెండు చోట్ల అంబేడ్కర్‌నగర్‌ కమ్యునిటీహాల్‌, రేస్‌కోర్స్‌ కమ్యునిటీ హాల్‌లో దరఖాస్తులు తీసుకున్నారు. ఉదయం నుంచే ప్రజలు కౌంటర్లకు చే రుకున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఓల్డ్‌మలక్‌పేట లో ఏర్పాటు చేసిన నాలుగు కౌంటర్లల్లో ప్రారంభమైన కొద్దిసేపట్లోనే దరఖాస్తుఫారాలు అయిపోయాయి. పారాల కోసం ప్రజలు జిరాక్స్‌ సెంటర్లకు, నెట్‌ సెంటర్లకు క్యూకట్టారు. ఒక్కో ఫారానికి రూ.10పెట్టి కొనుకున్నారు. కౌంటర్ల వద్ద దరఖాస్తుఫారాలు లేకపోవడంతో చాలామంది డబ్బులు పెట్టి కొన్నారు. ఎంఐఎం ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి అక్కడికివచ్చిన వారికి సహాయ సహకారం అందించారు.

రూ.40 ఇచ్చి కొన్నా...

నేను దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రానికి వెళ్లా ను. అక్కడ ఉన్న సిబ్బంది దరఖాస్తుఫారాలు అయిపోయాయి బైటతెచ్చుకోమన్నారు. జిరాక్స్‌ సెంటర్‌కు వెళ్లి రూ.40 ఇచ్చి తీసుకున్నాను. కుటుంబ వివరాలు నింపి కౌంటర్‌లో ఇచ్చాను.

- సలీమ, ఓల్డ్‌మలక్‌పేట

దరఖాస్తు ఫారంలను అందుబాటులో ఉంచాలి..

ప్రజా పాలనలో భాగంగా అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఫారంల కొరత లేకుండా అందుబాటులో ఉండే విధంగా చూడాలి. డివిజన్‌లోని కాలనీలు, బస్తీల ప్రజలు ఎక్కడైన దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలి.

- బచ్చు మహేషష్ గుప్తా, స్థానికుడు, చంపాపేట డివిజన్‌

మరో వారం రోజులు పొడిగించాలి

దరఖాస్తులు సరిపడా అందుబాటులో లేనందున అభయహస్తం కింద దరఖాస్తు చేసుకునే వారి కోసం ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించాలి. కాలనీలు, బస్తీల ప్రజలకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని అధికారులు ఆయా కేంద్రాల వద్ద అవగాహన కల్పించాలి.

- హైమత్‌, స్థానికుడు, చంపాపేట డివిజన్‌

Updated Date - Dec 29 , 2023 | 12:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising