ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS High Court: భైంసాలో అర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-02-20T14:01:30+05:30

నిర్మల్ జిల్లా: భైంసాలో అర్‌ఎస్‌ఎస్ (RSS) ర్యాలీ (Rally)కి అనుమతి నిరాకరణపై సోమవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్ జిల్లా: భైంసాలో అర్‌ఎస్‌ఎస్ (RSS) ర్యాలీ (Rally)కి అనుమతి నిరాకరణపై సోమవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నిర్మల్ పోలీసులు (Nirmal Police) అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరణపై ఆర్ఎస్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం రూట్ మ్యాప్‌ (Route Map)ను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను కోరింది.

ఆర్టికల్ 19 ప్రకారం సభలు, ర్యాలీలు ఎవరైనా నిర్వహించవచ్చునని హై కోర్టు స్పష్టం చేసింది. అయితే లా అండ్ అడర్ (Law and Order) సమస్య వల్లే అనుమతి నిరాకరించామని నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు. ర్యాలీకి మినహాయించి సభకు అనుమతి ఇచ్చేoదుకు సిద్ధంగా ఉన్నామని పోలీసులు స్పష్టం చేశారు. ర్యాలీకి అనుమతి ఇస్తే శాంతి భద్రత సమస్య వస్తోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ (Intelligence Report) ఇచ్చిందని, అందుకే ర్యాలీకి అనుమతి నిరాకరించామని తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీ వల్ల 15 రోజుల పాటు కర్ఫ్యూ (Curfew) పెట్టాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం బైoసాలో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి అనుమతిపై మధ్యాహ్నం 2:30 గంటలకు హై కోర్టు తీర్పు ఇవ్వనుంది.

Updated Date - 2023-02-20T14:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising