ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirmal: సీపీఆర్‌తో పిచ్చుకలనూ బతికించొచ్చని నిరూపించాడీ ఛాయ్‌వాలా..!

ABN, First Publish Date - 2023-03-27T16:45:31+05:30

గుండెపోటు వచ్చిన వారిని సీపీఆర్(CPR) చేసిన ప్రాణాలు కాపాడుతున్న ఘటనలు తరుచుగా చూస్తున్నాం. అయితే సీపీఆర్‌తో ఒక్క మనుషులకే కాదు..పక్షులకు ప్రాణం పోయొచ్చని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నిర్మల్: గుండెపోటు వచ్చిన వారిని సీపీఆర్(CPR) చేసిన ప్రాణాలు కాపాడుతున్న ఘటనలు తరుచుగా చూస్తున్నాం. అయితే సీపీఆర్‌తో ఒక్క మనుషులకే కాదు..పక్షులకు ప్రాణం పోయొచ్చని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. తన ఇంట్లోకి వచ్చి ప్రమాదవశాత్తు దెబ్బతగిలి సృహతప్పి పడిపోయిన ఓ బుజ్జి పిచ్చుక(sparrows)కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఓ చాయ్‌వాలా.. నిర్మల్(Nirmal) జిల్లా భైంసా(Bhainsa) మండలం హజ్గుల్ గ్రామంలో జరిగిన అరుధైన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

శ్యామ్ అనే వ్యక్తి ఇంటి వద్ద తిరుగుతున్న ఓ పిచ్చుక ధాన్యం గింజలకోసం ఇంట్లోకి వచ్చింది. అనుకోకుండా పిచ్చుకకు తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు తగిలాయి. దీంతో పిచ్చుక వెంటనే పడిపోయింది. పిచ్చుక పడిపోవడాన్ని గమనించిన శ్యాం.. పిచ్చుక గుండె ఆగిపోయినట్లు గుర్తించాడు. అయితే గుండె ఆగిపోయిన వారికి సీపీఆర్ చేసి బతికించొచ్చు అన్న మాట శ్యాంకు గుర్తొచ్చింది. వెంటనే శ్యాం ఆ పిచ్చుకకు సీపీఆర్ చేశాడు. మనుషులకు చేసినట్లుగా కాకుండా పిచ్చు శరీర స్వభావాన్ని బట్టి ఒక వేలితో మెల్లగా సీపీఆర్ చేశాడు.

ఎలాగైనా పిచ్చుకను బతికించాలని శ్యాం ప్రయత్నం వృధా కాలేదు.. పిచ్చుక గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. మెల్లగా ఊపిరి పీల్చుకుంది. సృహలోకి వచ్చిన పిచ్చుకకు శ్యాం, అతని పిల్లలు నీళ్లు తాగించారు. కాసేపటి తర్వాత కోలుకున్న పిచ్చుక మళ్లీ తుర్రుమంటూ హాయిగా ఎగిరిపోయింది. పిచ్చుక ప్రాణాలు కాపాడినందుకు శ్యాం సంతోషాన్ని వ్యక్తం చేశాడు.. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Updated Date - 2023-03-27T16:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising