ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amberpet CI Sudhakar: ఎన్‌ఆర్‌ఐ‌ని మోసం చేసిన అంబర్‌పేట సీఐ సుధాకర్‌పై సీపీ ఆనంద్ కన్నెర్ర

ABN, First Publish Date - 2023-01-13T21:12:02+05:30

భూ వివాదంలో చిక్కుకున్న అంబర్ పేట ఇన్స్పెక్టర్ సుధాకర్‌‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కన్నెర్ర చేశారు.

Amberpet SHO Sudhakar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భూ వివాదంలో చిక్కుకున్న అంబర్ పేట ఇన్స్పెక్టర్ సుధాకర్‌‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కన్నెర్ర చేశారు. సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరుతో ఎన్‌ఆర్ఐని మోసం చేశారనే ఆరోపణలతో సుధాకర్‌ను అరెస్ట్ చేశారు. సస్పెండెడ్ ఆర్ఐ రాజేశ్‌తో కలిసి సుధాకర్ ల్యాండ్ సెటిల్‌మెంట్ చేసినట్లు తేలింది. ఎన్‌ఆర్‌ఐ నుంచి సుధాకర్‌ 54 లక్షలు తీసుకున్నట్లు నిరూపణ అయింది. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి సీఐ సుధాకర్ డబ్బులు కొట్టేశారు. పోలీసులు విచారణ జరిపి సుధాకర్‌ను అరెస్ట్ చేశారు.

సస్పెండైన ఆర్ ఐ రాజేష్‌పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. కందుకూరు లిమిట్స్‌లోని నేదునూరు గ్రామంలో సర్వేనెంబర్ 54/2 లో ఉన్న పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి బి.ఎన్.రెడ్డి ఎస్ కే డి నగర్ కు చెందిన విజయ కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి 54.5 లక్షల రూపాయలు తీసుకొని నెలలు గడుస్తున్నా ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితులు వనస్థలిపురం పి ఎస్ లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలతో సస్పెండైన అర్ ఐ తాను ఎమ్మార్వోనంటూ నకిలీ ఐడి కార్డ్ సృష్టించి త్వరలో ప్రమోషన్ ద్వారా ఆర్డీఓ అవుతానని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నాడు. రాజేశ్ తమ నుంచి తీసుకున్న 54.5 లక్షల రూపాయలను సిఐ సుధాకర్‌కు ఇచ్చినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకు ఇప్పిస్తానన్న ల్యాండ్.. ఆర్ ఐ రాజేష్ సోదరుడు గతంలోనే కొనుగోలు చేశాడని చెప్పి దానిపై ధరణి పోర్టల్ లోగో తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ ల్యాండ్ అమ్ముతారంటూ తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులో తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-01-13T21:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising