ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్సర మృతదేహానికి ఇంకా మొదలు కాని పోస్ట్ మార్టం.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2023-06-10T10:53:38+05:30

పూజారి సాయికృష్ణ చేతిలో హతమైన అప్సర పోస్ట్‌మార్టం ఇంకా ప్రారంభం కాలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఉస్మానియా మార్చురీ లోనే అప్సర మృతదేహం ఉంది. పోస్ట్‌మార్టం ప్రక్రియకు ముందు అప్సర కుటుంబీకుల సంతకాలను సేకరించాల్సి ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి అప్సర తల్లి ఇంట్లోనే ఉంది. అప్సర తండ్రి కాశీలో ఉండటంతో తల్లిదండ్రుల ఇద్దరి సంతకాల కోసం ఉస్మానియా వైద్యులు ఎదురు చూస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : పూజారి సాయికృష్ణ చేతిలో హతమైన అప్సర పోస్ట్‌మార్టం ఇంకా ప్రారంభం కాలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఉస్మానియా మార్చురీ లోనే అప్సర మృతదేహం ఉంది. పోస్ట్‌మార్టం ప్రక్రియకు ముందు అప్సర కుటుంబీకుల సంతకాలను సేకరించాల్సి ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి అప్సర తల్లి ఇంట్లోనే ఉంది. అప్సర తండ్రి కాశీలో ఉండటంతో తల్లిదండ్రుల ఇద్దరి సంతకాల కోసం ఉస్మానియా వైద్యులు ఎదురు చూస్తున్నారు. నేడు తండ్రి కాశీ నుండి వస్తాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబీకులు సంతకం పెడితే పోస్ట్ మార్టం ప్రక్రియ మొదలు కానుంది.

కాగా.. అప్సర హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానున్నది. గర్భవతిగా ఉన్న అప్సరను సాయికృష్ణ హత్య చేశాడని తెలుస్తోంది. అప్సర గర్భంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైందని సమాచారం. మొదటిసారి అప్సర గర్భవతి అయినప్పుడు సాయికృష్ణ అబార్షన్ చేయించాడు. అయితే రెండోసారి కూడా అప్సర గర్భం దాల్చింది. గర్భం పైనే వివాదం జరిగినట్లు పోలీసులు అనుమనిస్తున్నారు. అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పోస్టుమార్టం పూర్తైతే కానీ ఈ హత్యపై పూర్తి కాలేదు. అప్సర తల్లిదండ్రుల సంతకాలు తీసుకున్న వెంటనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Updated Date - 2023-06-10T10:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising