Apsara Case : అప్సర హత్య తర్వాత సంచలన విషయాలు వెల్లడిస్తూ ఆమె అత్త ఆడియో విడుదల

ABN, First Publish Date - 2023-06-12T08:44:43+05:30

అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్సరను చూసి చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఒక ఆడియోను విడుదల చేశారు.

Apsara Case : అప్సర హత్య తర్వాత సంచలన విషయాలు వెల్లడిస్తూ ఆమె అత్త ఆడియో విడుదల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Apsara Case : అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్సరను చూసి చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఒక ఆడియోను విడుదల చేశారు. తన కుమారుని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

పెళ్లి అయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలంటూ టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారని ఆడియోలో ధనలక్ష్మి వెల్లడించారు. తన కుమారుడితో రోజు గొడవలు పడే వారిని ఒకరోజు తన కుమారుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడని వివరించారు. కార్తీక్ రాజాను అరెస్టు చేసి జైల్లో పెట్టారని వెల్లడించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కృంగిపోయాడని తెలిపారు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లి అరుణానే కారణమని ధనలక్ష్మి తెలిపారు. అప్పటి నుంచి అప్సర, అరుణ ఇద్దరూ కనిపించలేదని పేర్కొన్నారు. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నానని తెలిపారు. అప్సర, ఆమె తల్లి అరుణ హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదన్నారు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదన్నారు. అందుకోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని ధనలక్ష్మి తెలిపారు.

Updated Date - 2023-06-12T09:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising