ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Election: కేసీఆర్ ఏ హామీనీ నెరవేర్చలేదు: బీఆర్ఎస్‌పై మల్లికార్జున ఖర్గే ఫైర్

ABN, First Publish Date - 2023-10-29T16:05:31+05:30

ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీ రుణాలు, సాగు నీళ్లు... ఇలా ఏ హామీనీ సీఎం కేసీఆర్ నేరవేర్చలేదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.

సంగారెడ్డి: ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీ రుణాలు, సాగు నీళ్లు... ఇలా ఏ హామీనీ సీఎం కేసీఆర్ నేరవేర్చలేదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. సంగారెడ్డిలోని గంజ్ మైదానంలో కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. అందుకే సోనియా మరోసారి పూనుకొని తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న హామీలను చూపిస్తాం.. రమ్మని డీకే శివ కుమార్ సవాల్ విసిరితే... కేటీఆర్ తోక ముడిచారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


వీళ్లను జైలో వేసి చిప్ప కూడు తినిపించాలి

‘‘కర్ణాటకకు తీసుకెళ్లడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ రావాలా... ఫామ్ హౌజ్ రావాలా కేసీఆర్.. చెప్పు.. ఇదే మీకు మా సవాల్. పోతూ పోతూ మేడిగడ్డ మీదుగా పొయ్యి.. నువ్వు కట్టిన నాణ్యతలేని ప్రాజెక్ట్ చూసుకుంటా పోదాం. పనిమంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. మేడిగడ్డ పరిస్థితి అట్లుంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైలో వేసి చిప్ప కూడు తినిపించాలి’’ అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే నాయకుడు జగ్గారెడ్డిని గెలిపించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖర్గే ఇక్కడకు వచ్చారని అన్నారు. జగ్గన్నను 50 వేల మెజారిటీతో గెలిపించాలని, ఆయన రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషించబోతున్నారని అన్నారు.

Updated Date - 2023-10-29T16:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising