TS Election: ఓటర్ స్లిప్ ఇంకా అందలేదా? అయితే ఇలా చేయండి!
ABN, First Publish Date - 2023-11-29T14:59:48+05:30
మీకు ఇంకా ఓటర్ స్లిప్ అందలేదా? మీరు ఓటు ఎక్కడ వేయాలో తెలియడం లేదా?, మీ చేతిలో ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నా.. ఏం చేయాలో అర్థం కావడంలేదా?
మీకు ఇంకా ఓటర్ స్లిప్ అందలేదా? మీరు ఓటు ఎక్కడ వేయాలో తెలియడం లేదా?, మీ చేతిలో ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నా.. ఏం చేయాలో అర్థం కావడంలేదా? మీ పోలింగ్ సెంటర్ ఎక్కడుందో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కంగారు పడకండి. ఈ విషయాలు తెలుసుకోండి.
వాస్తవానికి ఎన్నికల ముందు ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేయడం బీఎల్‌వోల పని. కానీ ఇప్పటిదాకా చాలా చోట్ల ఓటర్ స్లిప్‌ల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. దీంతో సహజంగా ఓటర్లు అయోమయానికి గురవుతుంటారు. ఏ ఓటింగ్ కేంద్రానికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బందులు పడకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అదెలాగంటే..
ఓటర్ స్లిప్‌లు అందకపోతే ఇలా చేయండి
ఓటర్ స్లిప్‌లు ఇంకా అధికారులు అందించకపోతే ఆన్‌లైన్ ద్వారా గానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా గానీ, ఎస్‌ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.
అయినా మీకు ఓటర్ స్లిప్ అందకపోతే నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రంలో మీ పేరు ఉన్నట్లైతే గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయొచ్చు
పై పద్ధతుల్లో ఓటర్ స్లిప్‌ను పొందవచ్చు. ఒకవేళ ఆ విధంగా కూడా రాకపోతే మాత్రం ఇలా చేయండి
మెసేజ్‌తో ఇలా..
మీ చేతిలో ఫోన్ ఉంటే.. ఒక్క మెసేజ్‌తో పోలింగ్ బూత్ వివరాలను ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు. మీ దగ్గర గుర్తింపు కార్డు ఉంటే ఓ ఓటర్ నెంబర్ టైప్ చేసి 1950 లేదా 92117 28082 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పెడితే బూత్ వివరాలు వెంటనే వస్తాయి.
టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా..
ఎన్నికల సంఘం దగ్గర 24 గంటలూ పని చేసే టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంది. 1950కి ఫోన్ చేసి పోలింగ్ కేంద్రం, బూత్, నెంబర్, తదితర వివరాలు తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్..
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.
Updated Date - 2023-11-29T17:19:22+05:30 IST