ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly Polls : తెలంగాణలో సైలెంట్‌ పీరియడ్‌ మొదలైంది!

ABN, First Publish Date - 2023-11-28T17:31:02+05:30

Telangana Political Campaign Ends : తెలంగాణలో సైలెంట్‌ పీరియడ్‌ మొదలైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్‌ వెల్లడించారు. మంగళవారం నాడు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మీడియా మీట్ నిర్వహించిన వికాస్ రాజ్.. ఇక ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో సైలెంట్‌ పీరియడ్‌ మొదలైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్‌ వెల్లడించారు. మంగళవారం నాడు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మీడియా మీట్ నిర్వహించిన వికాస్ రాజ్.. ఇక ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు. పార్టీలో ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ‘స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలి. సినిమాలు, సోషల్‌ మీడియాలోనూ ప్రచారం నిషిద్ధం. టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశం ఉంది. ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు వద్దు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం. ఓటరు స్లిప్పుల్లో పార్టీల గుర్తులు, అభ్యర్థుల పేర్లు ఉండకూడదు. పోలింగ్‌ స్టేషన్లకు మొబైల్‌ అనుమతి లేదు’ అని వికాస్ రాజ్ వెల్లడించారు.


ఓటర్ల లెక్కలివీ..

  • నవంబర్-30న పోలింగ్‌.. డిసెంబర్‌-03న కౌంటింగ్‌

  • 119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు

  • బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్‌

  • తెలంగాణలో మొత్తం ఓటర్లు : 3 కోట్ల 26 లక్షలు

  • మహిళా ఓటర్లు : కోటి 63 లక్షల 1,705 మంది

  • పురుష ఓటర్లు : కోటి 62 లక్షల 92వేల 418 మంది

  • ట్రాన్స్‌జెండర్లు : 2,676 మంది

  • పోలింగ్‌ కేంద్రాలు : మొత్తం 35,655 ఏర్పాటు

  • సమస్యాత్మకమైనవి : 12వేల పోలింగ్‌ కేంద్రాలు

  • తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 9 లక్షల 99వేల 667 మంది

  • ఎన్నికల విధుల్లో లక్షా నలభై వేల మంది సిబ్బంది

  • 27,175 మంది హోం ఓటింగ్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం

  • 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్‌

  • ఎన్నికల విధుల్లో 40 వేల మంది సిబ్బంది

ప్రత్యేకంగా ఇలా..!

  • ఓటింగ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు

  • దివ్యాంగుల కోసం పోలింగ్‌ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు

  • దివ్యాంగుల కోసం 21,686 వీల్‌ ఛైర్లు సిద్ధం చేసిన అధికారులు

  • 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం

  • బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు

  • ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లు

  • 120 పోలింగ్‌ కేంద్రాలను నిర్వహించనున్న దివ్యాగులు

  • 597 పోలింగ్ కేంద్రాలను నిర్వహించనున్న మహిళలు

  • పోలింగ్‌ క్రతువులో పాల్గొననున్న 1,85,000 మంది సిబ్బంది

  • పోలింగ్ ప్రక్రియను పరిశీలించనున్న 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు

Updated Date - 2023-11-28T18:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising