ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mandava Venkateswara Rao: ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు.. పార్టీ మార్పుపై మండవ

ABN, First Publish Date - 2023-11-25T16:34:58+05:30

Telangana Elections: రాజకీయ మార్పు అనివార్యమైన పరిస్థితిలో మారాలన్న నిర్ణయం ఉండాలని పార్టీ మారడం జరిగిందని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు.

నిజామాబాద్: రాజకీయ మార్పు అనివార్యమైన పరిస్థితిలో మారాలన్న నిర్ణయం ఉండాలని పార్టీ మారడం జరిగిందని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు (Former Minister Mandava Venkateswara Rao ) అన్నారు. శనివారం బోదన్ బహిరంగ సభలో మండవకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ... పార్టీ మారడం ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. మలి విడత తెలంగాణ ఉద్యమంలో 360 మంది, రెండో విడతలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. ఆత్మబలిదానాలను చూసి సోనియాగాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అందరూ కేసీఆర్‌ను నిందిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే వ్యక్తిని అణిచివేసే వ్యక్తిగా కేసీఆర్ నిలిచారన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు కీర్తించిన వాళ్ళని ఇప్పుడు అణిచివేశారన్నారు.


ఎన్నికలప్పుడు కూడా పార్టీలోకి ఆహ్వానించిన తనకు నిలబడే ఉద్దేశం లేదు కాబట్టి వెళ్లలేదన్నారు. ఇప్పుడు కూడా తాను ఇదే చెప్పానని ఏ పదవుల కోసం పార్టీలోకి రావడం లేదని తెలిపారు. ఒకసారి టీఆర్ఎస్ గెలవగానే ఆయన కొంత పని చేస్తారని నమ్మకంతో ఆయనకు మద్దతు ఇచ్చానని చెప్పారు. పరిపాలన గాడి తప్పిందని అభిప్రాయ పడుతున్నానని చెప్పుకొచ్చారు. పోరాడే శక్తిని అణచివేశాడు కాబట్టే పార్టీ మారానని తెలిపారు. పోలీసులను మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శించారు. అవినీతి అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ధరణి మార్పు తెచ్చినప్పుడు ముఖ్యమంత్రికి హెచ్చరించడం జరిగిందన్నారు. ఇంత ఖర్చు చేసి నీరు తెప్పిస్తే ఎలా గిట్టుబాటు అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోందన్న ఆవేదనతో మాట్లాడుతున్నానని తెలిపారు. మంచిప్ప రిజర్వాయర్ ఏ స్థాయిలో ఉంది మీరు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబందు రూ.12000 లకు అబ్బా అన్నారు మరి ఇప్పుడు రూ.16,000 ఎక్కడి నుంచి తెచ్చేస్తారని ప్రశ్నించారు. సంపన్నమైన రాష్ట్రమని అంటున్నారు మరి ఐదు లక్షల కోట్ల అప్పు ఎట్లా అయిందని నిలదీశారు. ఉద్యోగస్తులకు 15వ తేదీ వరకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. మార్పులో ప్రతి ఓటర్ భాగస్వామ్య కావాలని మండవ వెంకటేశ్వరరావు కోరారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-25T17:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising