KCR: కేసీఆర్‌పై జోరుగా చర్చ జరుగుతున్న అంశం ఇదే..!
ABN, First Publish Date - 2023-12-04T04:08:55+05:30
ఒకపక్క కాంగ్రెస్ నుంచి మరో పక్క బీజేపీ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లతో పాటు, వరుసగా రానున్న లోక్‌సభ, మునిసిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవడం అంత సులువైన అంశం కాదన్న
విపక్షనేత ఎవరు?
ఆ బాధ్యత కేసీఆర్ తీసుకుంటారా?
కేటీఆర్‌కో, హరీశ్‌కో అప్పగిస్తారా?
అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? జోరుగా చర్చ
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో బీఆర్‌ఎస్ తరఫున విపక్షనేతగా ఎవరు ఉండనున్నారు? పార్టీ అధ్యక్షుడైన కేసీఆరే ఉంటారా? లేదంటే కేటీఆర్‌కో, హరీశ్‌కో అప్పగిస్తారా? దీనిపై పార్టీలో, ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉద్యమ సమయంలో తప్ప విపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు తొలిసారిగా ఈ పాత్ర ను ఆ పార్టీ పొషించాల్సి ఉంటుంది. ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, విపక్షనేతగా బాఽధ్యలు తీసుకునేందుకు ఇష్టపడతారా? అస లు ఆయన అసెంబ్లీకి వస్తారా? అనే చర్చా జరుగుతోంది. అధికారంలో ఉన్న రోజుల్లో బీఆర్‌ఎస్.. విపక్షాలను ఇబ్బంది పెట్టిందనే విమర్శలున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తమ పార్టీలో చేర్చుకుని, రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చింది. ఒక దశలో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసింది. ఇదే అస్త్రాన్ని అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రయోగిస్తే బీఆర్‌ఎస్ ఎలా ఎదుర్కొంటుంది? అనేదానిపైనా చర్చ జరుగుతోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ భవిష్యత్తులో పెను సవాళ్లను ఎదుర్కొక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకపక్క కాంగ్రెస్ నుంచి మరో పక్క బీజేపీ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లతో పాటు, వరుసగా రానున్న లోక్‌సభ, మునిసిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవడం అంత సులువైన అంశం కాదన్న విశ్లేషణలున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మార్చి, ఏప్రిల్ మాసా ల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు బీఆర్‌ఎ్‌సకు సవాల్‌గా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీగా కాంగ్రెస్ దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది. బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో గట్టీ పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్‌ఎస్ అభ్యర్థులు మనుగడను కాపాడుకోవడం అంత సులువైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత వరుసగా సర్పంచ్, స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సాధారణంగా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలోని పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఈ కోణంలో చూస్తే.. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు కలిసివచ్చే అంశంగా మారుతాయి. ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎ్‌సకు స్థానిక సంస్థ ల ఎన్నికల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి తప్పదనే వాదన వినిపిస్తోంది.
Updated Date - 2023-12-04T11:38:51+05:30 IST