ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Elections: గ్లాస్‌ పార్టీని ఆదరించని తెలంగాణ ప్రజలు

ABN, First Publish Date - 2023-12-04T04:44:33+05:30

పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ఉధృత ప్రచారం నిర్వహించినా, మెజారిటీ స్థానాల్లో పోటీ ఇవ్వలేకపోయింది.

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆర్భాటంగా పోటీలోకి దిగిన జనసేనకు ఒక్క స్థానంలో మినహా అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ఉధృత ప్రచారం నిర్వహించినా, మెజారిటీ స్థానాల్లో పోటీ ఇవ్వలేకపోయింది. కూకట్‌పల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాం డూరు, అశ్వారావుపేటలో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. కూకట్‌పల్లిలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయి లో ఓట్లు సాధించింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ సుమారు 40 వేల ఓట్లు సాధించారు. మిగతా 7 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎక్కడా పార్టీ అభ్యర్థులు సగటున 2 వేలకు మించి ఓట్లు సాధించలేదు. కోదాడ (2,151), కొత్తగూడెం (1,945)లో 8వ స్థానానికి పరిమితమయ్యారు. అశ్వారావుపేట (2,281), ఖమ్మం (2,658), నాగర్‌కర్నూల్‌ (1,955)లో 6వ స్థానంలో, తాం డూరు (4,087), వైరా (2,712)లో 4వ స్థానంలో నిలిచారు.

Updated Date - 2023-12-04T11:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising