ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jeevan Reddy: గత ప్రభుత్వ అక్రమాలు వెలికి తీయడంపై ప్రజల్లో హర్షం

ABN, First Publish Date - 2023-12-08T15:35:32+05:30

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) అభిప్రాయపడ్డారు. జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వ పాలన సమైక్యాంధ్ర పాలనా కంటే అధ్వాన్నంగా సాగింది. రాష్ట్ర అప్పు రూ.6 లక్షల కోట్లకు దాటింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు, నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖనే చెప్పింది. ఆ ప్రాజెక్ట్‌కు అనుమతి కూడా లేదు. లక్షా 20 వేల కోట్ల ఆర్థిక భారం పడింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో అన్ని రకాల కేసీఆర్ బాధ్యుడు (Cm kcr). ఆ ప్రాజెక్ట్‌కి సీడబ్ల్యూసీ (CWC) అనుమతి కూడా లేదని కేంద్రం చెబుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి. బాధ్యలైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై వాస్తవాలను ప్రభుత్వం వెలికి తీయడంపై హర్షం వ్యక్తమవుతోంది. వాస్తవాలను ప్రజలకు తెలియ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్రతో ఒప్పందం ఉన్నందున తుమ్మడి హట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలి. తుమ్మడి హట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. మహిళలకు ఉచిత ప్రయాణంపై సోనియా గాంధీ పుట్టిన రోజు నుంచి అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.’’ అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-12-08T15:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising