Priyanka Gandhi: కాంగ్రెస్ సర్కార్ రాగానే అందరికీ సంక్షేమం అందిస్తాం
ABN, First Publish Date - 2023-11-24T17:44:15+05:30
తొర్రూరు కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
మహబూబాబాద్: తొర్రూరు కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. యువత ఆలోచనలకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఉండాలని, 10 ఏళ్లలో యువతకు ఉద్యోగాలు దొరకలేదని, కష్టపడి ఉద్యోగాల కోసం పరీక్ష రాస్తే పేపర్ లీకులు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నిరుద్యోగుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
"వీరులను కన్న భూమి తెలంగాణ. యశస్విని రెడ్డి కోడలా...బిడ్డా అని ఝాన్సీ రెడ్డిని అడిగాను. నా కూతురు లాంటి కోడలు అని ఝాన్సీ రెడ్డి చెప్పారు. ఇలాంటి మంచి కుటుంబం మీకోసం రావడం సంతోషం. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఎన్నికల సమయం, అందరం ఆలోచించాల్సిన సమయం. నాయకులు ఎలాంటి వారో ప్రజలు ఆలోచించాలి. 10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఇచ్చాం. ఇక్కడ పరిపాలన ఎలా ఉందో మీకు తెలుసు. మీ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ గురించి అందరం ఆలోచించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధికి మీ ఓటు ఎంతో కీలకం. యువత ఆలోచనలకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఉండాలి. పదేళ్లలో యువతకు ఉద్యోగాలు దొరకలేదు. కష్టపడి ఉద్యోగాల కోసం పరీక్ష రాస్తే పేపర్ లీకులు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై దుష్ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రజలను ఈ ప్రభుత్వం చీకటిలోకి తీసుకెళ్తుంది. యువత దేశానికి పట్టుకొమ్మలు." అని ప్రియాంక గాంధీ చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ రాగానే అందరికీ సంక్షేమం అందిస్తాం
"కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో యువతకు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. యువత కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కచ్చితమైన ఉద్యోగాల కల్పన అందిస్తాం. ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఇక్కడి మహిళలు ఎంతో ఇబ్బందికర జీవితం గడుపుతున్నారు. మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల రక్షణ, గౌరవం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. రైతు సోదరులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అన్ని వర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ రాగానే అందరికీ సంక్షేమం అందిస్తాం. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు కుంభకోణాలకు కేరాఫ్ గా మారాయి. బీఆరెస్, బీజేపీ రెండు ఒక్కటే. అందుకే మార్పు కావాలి... కాంగ్రెస్ రావాలి." అని ప్రియాంక గాంధీ అన్నారు.
Updated Date - 2023-11-24T17:44:36+05:30 IST