ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy : అప్పట్లో కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుని గెలిపించినం కానీ..

ABN, First Publish Date - 2023-11-06T13:37:42+05:30

నామినేషన్ వేసేందుకు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాద బలంతో ముందుకు నడుస్తున్నానన్నారు.

వికారాబాద్ : నామినేషన్ వేసేందుకు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాద బలంతో ముందుకు నడుస్తున్నానన్నారు. కొడంగల్ జనం ఆలోచించాలని.. తనకు ఇచ్చిన హోదా, పదవి మీదేనన్నారు. కొడంగల్ ప్రతి బిడ్డా పీసీసీ అద్యక్షుడేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్‌ను గజ్వేల్.. సిరిసిల్ల.. సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తామని.. కృష్ణా నీటిని తెస్తామని చెప్పి గెలిచారన్నారు. ఆ మాటలు నమ్మి గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేశారని.. కానీ అవన్నీ మోసపు మాటలుగానే మిగిలాయన్నారు. గొల్ల కురుమలు డీడీలు కట్టారు కానీ ఒక్క గొర్రె కూడా ఇవ్వలేదని రేవంత్ తెలిపారు.

‘‘2009లో కరీంనగర్ నుంచి కేసీఆర్ పారిపోయి పాలమూరుకు వస్తే మేము కడుపులో పెట్టుకుని గెలిపించినం. కొడంగల్ నుంచి పోటీ చేయమని నేను కేసీఆర్‌కు సవాల్ విసిరితే.. ఇక్కడ ఇచ్చిన ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. కనుక ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేయడం లేదు. ఈ ఎన్నికలు మన కొడంగల్‌కు ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. మనను చరిత్రలో నిలబెడతాయి. ఇక్కడి ఎమ్మెల్యే ఒక్కసారి కూడా కొడంగల్ కోసం అసెంబ్లీలో అడగలేదు. మరి ఇపుడు ఓట్లు ఎట్లా అడుగుతాడు? కొడంగల్ కోసం నేను, గురునాథ్ రెడ్డి.. నందారం కుటుంబం ఏకమయ్యాం. మీరంతా కూడా ఏకం కావాలి. కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు లక్షకు పైగా మెజారిటీ ఇచ్చారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా ఎక్కువగా మెజారిటీ ఇప్పించాలి. ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు కోసం నేను బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-06T13:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising