ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fake News: రేవంత్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వార్తను ఖండించిన ఆంధ్రజ్యోతి

ABN, First Publish Date - 2023-11-29T11:45:44+05:30

మరికొన్ని గంటల్లో తెలంగాణలో పోలింగ్‌కు రెడీ అవుతున్న తరుణంలో కొందరు తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని ఫేక్ న్యూస్‌లు సృష్టిస్తున్నారు

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో తెలంగాణలో పోలింగ్‌కు రెడీ అవుతున్న తరుణంలో కొందరు తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని ఫేక్ న్యూస్‌లు సృష్టిస్తున్నారు. ఆంధ్రజ్యోతి విశ్వసనీయతను దెబ్బతీసేలా కథనాలు సృష్టించి వైరల్ చేస్తున్నారు.

తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరుతో ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుగా ఓ తప్పుడు కథనాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘‘కాబోయే సీఎం నేనేనని.. పైసలు ఇవ్వకుంటే బొక్కలో వేస్తానని కాంట్రాక్టర్లను రేవంత్ బెదిరించినట్లు’’ ఓ ఫేక్ కథనాన్ని సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తను యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు చూపుతున్న కథనం ఫేక్ వార్త అని యాజమాన్యం స్పష్టం చేసింది. ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆంధ్రజ్యోతి యాజమాన్యం హెచ్చరించింది.

Updated Date - 2023-11-29T11:48:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising