ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: కరెక్ట్‌గా ఈ సమయంలోనే ప్రకృతి పగబట్టింది

ABN, First Publish Date - 2023-12-04T04:10:23+05:30

బీఆర్‌ఎ్‌సకు కాలం కలిసిరాలేదు. ప్రకృతి కూడా ఆ పార్టీపై పగబట్టింది. కీలకమైన ఎన్నికల సమయంలో పలు అంశాలు ‘కారు’ పార్టీని ఇరుకున పెట్టాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చెప్పుకొనే కాళేశ్వరం..

  • ప్రకృతి పగబట్టింది!

  • ‘కారు’ పార్టీకి కలిసిరాని కాలం

  • కీలక సమయంలో బయటపడ్డ కాళేశ్వరం లోపాలు

  • ప్రవళ్లిక ఆత్మహత్య, కొంపముంచిన చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు కాలం కలిసిరాలేదు. ప్రకృతి కూడా ఆ పార్టీపై పగబట్టింది. కీలకమైన ఎన్నికల సమయంలో పలు అంశాలు ‘కారు’ పార్టీని ఇరుకున పెట్టాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చెప్పుకొనే కాళేశ్వరం.. ప్రచారానికి పనికిరాకుండా పోయింది. కీలక సమయంలో వరదలు లేకున్నా మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. దీనికి కొనసాగింపుగా అన్నారం బ్యారేజీలో లీకేజీలతో బుంగలు ఏర్పడ్డాయి. దీంతో వీటిని పరిశీలించిన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఏమాత్రం సురక్షితం కావని, మూడు బ్యారేజీల డిజైన్లు ఒకేలా ఉండటంతో వీటితో ఏమాత్రం ఉపయోగం లేదని కేంద్రానికి తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలోనే ప్రచారంలో గులాబీ నేతలు రూ.లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఊసే ఎత్తలేకపోయారు. ఇక పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం, నోటిఫికేషన్‌ రద్దుతో ప్రవళ్లిక ఆత్మహత్యతో రాష్ట్రంలో అలజడి రేగింది. నోటిఫికేషన్‌ రద్దుకు ప్రవళ్లిక ఆత్మహత్యకు సంబంధం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించడం కూడా నిరుద్యోగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ కొల్లాపూర్‌లో బర్రెలక్క(శిరీష) స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్‌ఎ్‌సను సవాల్‌ చేయడం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఆలోచనలో పడేసింది. ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును జగన్‌ సర్కారు కుట్రపూరితంగా అరెస్ట్‌ చేసిన సమయంలో మంత్రి కేటీఆర్‌ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం కూడా రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే ఆ తర్వాత నష్టనివారణకు ఎన్ని ప్రకటనలు చేసినా అవి ఫలప్రదం కాలేదు. బీఆర్‌ఎస్‌ గెలుపుపై ఇవన్నీ కూడా ప్రభావం చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - 2023-12-04T15:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising