TS Polling: ఆ మూడు జిల్లాల్లో 60 శాతంపైగా పోలింగ్ నమోదు
ABN, First Publish Date - 2023-11-30T17:33:11+05:30
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడు జిల్లాల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడు జిల్లాల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా
1. సంగారెడ్డిలో 61.13 శాతం పోలింగ్ నమోదు
2. పటాన్ చెరులో 48.32 శాతం పోలింగ్ నమోదు
3. ఆందోల్‌లో 58.23 శాతం పోలింగ్ నమోదు
4. నారాయణఖేడ్‌లో 52.02 శాతం పోలింగ్ నమోదు
5. జహీరాబాద్‌లో 57.66 శాతం పోలింగ్ నమోదు
మెదక్ జిల్లా
1. మెదక్‌లో 69.42 శాతం పోలింగ్ నమోదు
2. నర్సాపూర్‌లో 69.24 శాతం పోలింగ్ నమోదు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 గంటల వరకు 56.50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ రూరల్‌లో 62.80 శాతం పోలింగ్ నమోదు. అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్‌లో 46.11 శాతం పోలింగ్ నమోదు. నిజామాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి ఓటర్లు ముందుకు రాలేదు.
Updated Date - 2023-11-30T17:39:01+05:30 IST