ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRTP: అభ్యర్థులను ప్రకటించే అంశంలో వైఎస్సార్టీపీలో సందిగ్ధత

ABN, First Publish Date - 2023-11-02T22:24:17+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో పోటీ చేస్తామని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి ( YS Sharmila Reddy ) ప్రకటించారు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో పోటీ చేస్తామని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి ( YS Sharmila Reddy ) ప్రకటించారు. పోటీ చేసేందుకు అబ్యర్థులు సిద్ధంగా ఉండాలని షర్మిల పిలుపునిచ్చారు. షర్మిల పిలుపు మేరకు అభ్యర్థులు మూడురోజులుగా లోటస్ పాండ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అభ్యర్థులు రోజు కార్యాలయానికి వచ్చి వెళ్లడమే కాని పోటీ చేసే అభ్యర్థుల గురించి షర్మిల ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో అభ్యర్థులు డైలామాలో పడ్డారు. షర్మిల ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కొంతమంది అభ్యర్థులు పోటీకి దూరమవుతున్నారు. అయితే మరి కొంతమంది అభ్యర్థులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. అభ్యర్థుల ప్రకటన చేస్తారో లేదోనని టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పటికే లోటస్ పాండ్లో పలుమార్లు నేతలు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు. నామినేషన్లకు ఇంకా ఒక్క రోజే గడువు ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. నిన్నటి నుంచి లోటస్ పాండ్‌లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు మరోసారి లోటస్‌పాండ్‌లో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళనకు దిగారు. టికెట్ల ప్రకటన ఆలస్యం అవుతున్న కారణంగా రాజకీయంగా తమకు నష్టం వాటిల్లుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-11-02T22:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising