ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Balakrishna: నర్సుపై చేసిన వ్యాఖ్యలపై బాలయ్య రియాక్షన్ ఏంటంటే..

ABN, First Publish Date - 2023-02-06T13:29:01+05:30

ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వివాదాలేం కొత్త కాదు. తరచూ ఏదో ఒక విషయంతో ఆయన వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లామ్‌లో నందమూరి బాలకృష్ణ హోస్టింగ్‌లో వచ్చిన అన్‌స్టాపబుల్‌లో నర్సుపై కామెంట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Balakrishna : ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వివాదాలేం కొత్త కాదు. తరచూ ఏదో ఒక విషయంతో ఆయన వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లామ్‌లో నందమూరి బాలకృష్ణ హోస్టింగ్‌లో వచ్చిన అన్‌స్టాపబుల్‌లో నర్సుపై కామెంట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 ఫినాలేకి గెస్ట్‌గా వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ షోలో పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి వివరిస్తూ నర్సుపై చేసిన కామెంట్‌తో బాలయ్య మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో తనకు జరిగిన ఒక యాక్సిడెంట్ గురించి చెప్తూ ఓ నర్సు అందంగా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దీంతో బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నిమ్స్ నర్సులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అన్ స్టాపబుల్ షోను బహిష్కరిస్తామని నర్సులు చెబుతున్నారు.

రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం..

‘‘నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది నర్సులు రాత్రనక, పగలనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా’’ అని బాలయ్య పోస్ట్ పెట్టారు.

Updated Date - 2023-02-06T14:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising