BRS: బీఆర్ఎస్కు బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా
ABN, First Publish Date - 2023-10-15T12:13:59+05:30
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. భద్రాచలం బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు సీఎం కేసీఆర్ (CM KCR) ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. భద్రాచలం బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు సీఎం కేసీఆర్ (CM KCR) ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గతంలోనూ స్థానిక సంస్థల సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు బాలసానికి ఇవ్వకుండా తాతా మధుసూదన్‌కు పార్టీ అదిష్ఠానం అవకాశం ఇచ్చింది. దీంతో గత కొద్ది రోజులుగా బాలసాని బీఆర్ఎస్‌పై అలక వహించారని తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరాలని కోరేందుకు మరి కొద్ది సేపట్లో బాలసాని ఇంటికి పోంగులేటి, తుమ్మల వెళ్లనున్నారు. వీరిద్దరి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బాలసానితో చర్చలు జరిపారు. బీఆర్ఎస్‌లో ఉండాలని సూచించారు. అలాగే బాలసానిని మంత్రి కేటీఆర్‌తో రవిచంద్ర మాట్లాడించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని సమాచారం.
Updated Date - 2023-10-15T12:13:59+05:30 IST