TSPSC Paper Leak: సిట్ విచారణకు వెళ్లకూడదని బండి సంజయ్ నిర్ణయం
ABN, First Publish Date - 2023-03-25T20:21:42+05:30
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak)పై ఏర్పాటు చేసిన సిట్ విచారణకు వెళ్లకూడదని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak)పై ఏర్పాటు చేసిన సిట్ విచారణకు వెళ్లకూడదని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్-1 పేపర్ లీక్ అయిందని సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని సిట్ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 26న సిట్ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే రేపటి సిట్ విచారణకు బండి సంజయ్ తరపున బీజేపీ లీగల్ టీమ్ (BJP Legal Team)ను పంపాలని సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. కర్నాటక (Karnataka) ఎన్నికల ప్రచారంలో భాగంగా బీదర్‌లో కేంద్రమంత్రి అమిత్‌షా సభలో బండి సంజయ్ పాల్గొననున్నారు. అందువల్ల సిట్ విచారణకు సంజయ్ హాజరుకావడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం లీక్ అయిందని, అందులో భాగంగానే జగిత్యాల జిల్లాలోని ఒక మండలంలో 50 మందికిపైగా, ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అభ్యర్థులు అర్హత సాధించారని సంజయ్ ఇటీవల ఆరోపించారు. క్వాలిఫై అయిన వారిలో బీఆర్‌ఎస్ జడ్పీటీసీ, సింగిల్ విండో చైర్మన్, సర్పంచ్ పిల్లలు, వారి బంధువులు ఉన్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సిట్.. సంజయ్‌కి 91 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తీసుకుని ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. బంజారాహిల్స్‌లోని సంజయ్ ఇంటికి మంగళవారం వచ్చిన సిట్ అధికారులు, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు.
Updated Date - 2023-03-25T20:24:37+05:30 IST