ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Paper Leak: సిట్ విచారణకు బండి సంజయ్ దూరం..!

ABN, First Publish Date - 2023-03-23T21:02:34+05:30

శుక్రవారం (రేపు) సిట్ విచారణకు బీజేపీ నేత బండి సంజయ్ (BJP leader Bandi Sanjay) డుమ్మా కొట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: శుక్రవారం (రేపు) సిట్ విచారణకు బీజేపీ నేత బండి సంజయ్ (BJP leader Bandi Sanjay) డుమ్మా కొట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయన సిట్కు లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీలకు విప్ ఉన్న నేపథ్యంలో పార్లమెంట్కు అటెండ్ కావాలనే కారణం చెప్పే అవకాశం ఉంది. సిట్ను పట్టించుకోవద్దని ముందు భావించినా.. బీజేపీ (BJP) స్టాండ్ మార్చుకుంటోంది. సంజయ్ దగ్గర ఉన్న సమాచారం సిట్కు పంపిస్తారా?.. టైమ్ అడుగుతారా?.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ (TSPSC Paper Leak)పై ఏర్పాటు చేసిన సిట్.. బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చింది. గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌ అయిందని ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయిందని, అందులో భాగంగానే జగిత్యాల జిల్లాలోని ఒక మండలంలో 50 మందికిపైగా, ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అభ్యర్థులు అర్హత సాధించారని సంజయ్‌ ఇటీవల ఆరోపించారు. క్వాలిఫై అయిన వారిలో బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, సింగిల్‌ విండో చైర్మన్‌, సర్పంచ్‌ పిల్లలు, వారి బంధువులు ఉన్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సిట్‌.. సంజయ్‌కి 91 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తీసుకుని ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. బంజారాహిల్స్‌లోని సంజయ్‌ ఇంటికి మంగళవారం వచ్చిన సిట్‌ అధికారులు, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు.

Updated Date - 2023-03-23T21:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising