ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay : బండి సంజయ్ సతీమణి కీలక వ్యాఖ్యలు.. ఆయన సెల్‌ఫోన్ ఎక్కడుందో తెలియదట..

ABN, First Publish Date - 2023-04-06T13:50:41+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ సతీమణి అపర్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ సెల్‌ఫోన్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నేడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో అపర్ణ మాట్లాడుతూ.. సంజయ్ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో తమకు తెలియదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ సతీమణి అపర్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ సెల్‌ఫోన్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నేడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో అపర్ణ మాట్లాడుతూ.. సంజయ్ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో తమకు తెలియదన్నారు. అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారని.. తోపులాటలో సెల్ ఫోన్ పడిపోయిందేమోనని అపర్ణ అన్నారు. సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉందో పోలీసులకే తెలియాలన్నారు. పోలీసుల ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. మెడిసిన్ వేసుకున్నారని అపర్ణ తెలిపారు.

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని అసమర్థంగా చూపడానికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేయడానికి ప్రయత్నించారని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. మంగళవారం నాటి పదోతరగతి హిందీ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌, బీజేపీ కార్యకర్త ప్రశాంత్‌ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం నుంచే వాట్సా్‌పలో సుదీర్ఘంగా చాటింగ్‌ చేశారని, వాట్సాప్‌ కాల్స్‌ మాట్లాడుకున్నారన్నారు. ఆ తర్వాతే హిందీ పేపర్‌ లీకేజీకి కుట్ర పన్నారని తెలిపారు. ఆ మేరకు ఆధారాలు లభించాయన్నారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నపత్రం లీకేజీ తీరు, బండి సంజయ్‌ అరెస్టుకు కారణాలను సీపీ రంగనాథ్‌ వివరించారు. మంగళవారం జరిగిన పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం కమలాపూర్‌ మండల కేంద్రంలోని స్కూల్‌ నుంచి బయటకు వచ్చిందన్నారు. ‘‘ఈ కేసులో బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచాం. రిమాండ్‌ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా, ప్రశాంత్‌ను ఏ2గా చేర్చాం. ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేశాం. బూర ప్రశాంత్‌ను మంగళవారమే అరెస్టు చేశాం. సంజయ్‌, ప్రశాంత్‌ కలిసి.. పిల్లల సాయంతో ప్రశ్నపత్రాన్ని బయటకు తెప్పించారు. ప్రశాంత్‌ ఉదయం 11.18 గంటలకు ఫోటో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశాడు. 11.24 గంటలకు బండి సంజయ్‌కు పంపాడు. తర్వాత ఆ ప్రశ్నపత్రం చాలా మందికి ఫార్వర్డ్‌ అయ్యింది. ప్రశాంత్‌తో పాటు మహేశ్‌ కూడా చాలా మందికి ప్రశ్నపత్రాన్ని షేర్‌ చేశాడు. ఈటల రాజేందర్‌, ఆయన ఏపీకు కూడా పంపించారు. వాట్సా్‌పలో ప్రశ్నపత్రాన్ని ఫార్వార్డ్‌ చేసిన తర్వాత ప్రశాంత్‌ 149 మందికి కాల్‌ చేశారు’’ అని సీపీ వెల్లడించారు.

Updated Date - 2023-04-06T13:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising