Telangana Elections: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్
ABN, First Publish Date - 2023-12-03T11:43:05+05:30
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు..? ఎంత మెజారీటీతో గెలుస్తారన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయ్. జిల్లాల వారీగా కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ కాస్తున్నారు.
Betting On Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు..? ఎంత మెజారీటీతో గెలుస్తారన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయ్. జిల్లాల వారీగా కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ కాస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌ల తరహాలోనే ఎన్నికల ఫలితాలపై డబ్బులు చేతులు మారుతున్నాయ్. ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపైనా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఎక్కువ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో లక్షల్లో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఎక్కడికక్కడ పందాలు కాస్తున్నట్టు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలపై ఉత్కంఠ ఉంది. ఇలాంటి నియోజకవర్గాల్లో బెట్టింగ్ మరింత జోరుగా సాగుతోంది. 500 నుంచి 2 వేల మధ్య ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్న చోట పందాలు కాసేందుకు కొందరు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది.
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక చోట్ల లక్షల్లో పందాలు కాస్తున్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బెట్టింగ్‌లు వేస్తున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 50వేల వరకు గెలుపుపై బెట్టింగులు కాస్తున్నారు. తెలంగాణేతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా పందాలు వేస్తున్నట్టు సమాచారం. జడ్చర్ల, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ ఉంది. ఈ అసెంబ్లీ స్థానాల్లో 10 వేల నుంచి లక్ష వరకు బెట్టింగ్ సాగుతోంది. ఫోన్‌లు, ఆన్‌లైన్‌లోనే పలుచోట్ల బెట్టింగ్ దందా సాగుతున్నట్టు సమాచారం. కొంతమంది దీన్నో వ్యాపారంగా మలచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ప్రధాన పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బెట్టింగ్‌లో భాగమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనూ బెట్టింగ్ తీవ్రంగా జరుగుతోందని సమాచారం. పోలీసులు కౌంటింగ్ విధుల్లో ఉన్నందున..బెట్టింగ్ బాబులు రెచ్చిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Updated Date - 2023-12-03T11:43:06+05:30 IST