TS Inter Results : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇలా అస్సలు చేయకండి..
ABN, First Publish Date - 2023-05-09T14:01:22+05:30
తెలంగాణ ఇంటర్ ఫలితాలు (TS Inter Results) వచ్చాయి. మంగళవారం ఉదయం విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు (Inter Exams) రాయగా..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు (TS Inter Results) వచ్చాయి. మంగళవారం ఉదయం విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు (Inter Exams) రాయగా.. ఫస్టియర్‌లో 63.85 శాతం, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. 4.33 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఇందులో 2.72 లక్షల మంది మాత్రమే పాసయ్యారు. ఇందులో బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. A గ్రేడ్, 1.60 లక్షల మంది, B గ్రేడ్ 68,333 మంది పాసయినట్లు సబిత తెలిపారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్.. సెకండియర్‌లో ములుగు జిల్లాలు ప్రథమ స్థానంలో నిలిచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి, విద్యాశాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు.
ఇలా చేయండి..
ఫెయిల్ అయిన విద్యార్థులు భాధపడొద్దు.. ఆందోళన చెందవద్దు : సబితా ఇంద్రారెడ్డి
పిల్లలపై తల్లిదండ్రులు ఫెయిల్ అయితే సీరియస్ అవ్వొద్దు
ఫలితాలపై ఎవరికైనా సందేహాలు ఉంటే రీ- వెరిఫికేషన్ చేసుకోవచ్చు
మే- 10 నుంచి మే- 16 వరకు సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు
జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి
సెకండియర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
ఎంసెట్ రాసేవాళ్ళు ఇంటర్మీడియట్ ఫలితాలను పట్టించుకోవద్దు
ఎంసెట్ రాసేవాళ్ళు ప్రశాంతంగా పరీక్షలు రాయండి
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దనే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించాం
ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వ కళాశాలలో మెరుగ్గా ఉంది
జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ పాఠశాలతో పోటీ పడాలి
ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో 46శాతం మాత్రమే ఫలితాలు ఉన్నాయి : సబితా ఇంద్రారెడ్డి
ఇదిగో హెల్ప్‌లైన్.. కాల్ చేయండి..
ఇంటర్ విద్యార్థుల కోసం టెలీ మాసన్ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశాం : ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్
హెల్ప్ లైన్ నెంబర్ 14416 కు కాల్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు
ఈ నంబర్ విద్యార్థులకు పరీక్షా సమయంలో కూడా ఉపయోగపడంది
ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది అండగా ఉంటుంది : మిట్టల్
మెమోలు ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
విద్యార్థులకు అందుబాటులో మెమోలు ఉన్నాయి : విద్యాశాఖ
https://results.cgg.gov.in/ResultMemorandum.do వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు
సాయంత్రం 5 గంటల నుంచి కలర్ ప్రింట్ మెమోస్ డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్
హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మెమో పొందవచ్చు
జనరల్, వొకేషనల్, బ్రిడ్జి కోర్స్ విద్యార్థులు కేటగిరి మార్చుకుని ఆన్‌లైన్‌లో మెమో పొందవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది.
కాగా.. ప్రభుత్వం ఇంతలా ధైర్యం చెబుతున్నా తెలంగాణలో పలుచోట్ల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం.
Updated Date - 2023-05-09T14:12:26+05:30 IST