ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics : బీజేపీకి మరో ఊహించని షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత!

ABN, First Publish Date - 2023-08-14T23:22:38+05:30

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి షాకులు ఎక్కువయ్యాయి.! మాజీ మంత్రి, సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే పార్టీకి మరో ఊహించని ఝలక్ తగిలింది..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి షాకులు ఎక్కువయ్యాయి.! మాజీ మంత్రి, సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే పార్టీకి మరో ఊహించని ఝలక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన కీలక నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినయ్ కుమార్ రెడ్డి కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈ మేరకు లేఖ రాశారు. గత కొంతకాలంగా ఎంపీ ధర్మపురి అరవింద్‌తో విభేదాలు ఉన్నాయి. పలుమార్లు ఎంపీకి వ్యతరేకంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆందోళన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి.


కాంగ్రెస్ గూటికి!

కాగా.. 2018లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వినయ్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఎంపీ అర్వింద్ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతర్గత పార్టీ కుమ్ములాటతోనే విసిగి వేసారి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వినయ్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన నేతలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతుండటంతో పార్టీలో కొత్త జోష్ వచ్చినట్లు అవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు బీఆర్ఎస్, బీజేపీ నుంచి సిట్టింగ్‌లు, కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

రాజీనామా లేఖలో ఇలా..!


ఇవి కూడా చదవండి


TS Assembly Elections 2023 : కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితా రిలీజ్ ఎప్పుడంటే..?


TS Assembly Elections 2023 : మంత్రి సబిత- తీగల చెట్టాపట్టాల్.. అరగంట పాటు రహస్య సమావేశం..!


TS Politics : చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్.. ఎక్కడ్నుంచి పోటీచేస్తారంటే..!?


ABN Exclusive : హైదరాబాద్‌లో మరో ఘోరం.. క్రీడాకారిణికి మంత్రి పేషీలోని ఉద్యోగి వేధింపులు


AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!


YuvaGalam : లోకేష్ ‘యువగళం’ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్.. రంగంలోకి దిగిన కేశినేని చిన్ని..!


Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?


KCR Govt : కేసీఆర్ మరో ఎలక్షన్ స్టంట్.. ఆగస్టు-15 వేళ తియ్యటి శుభవార్త!


Updated Date - 2023-08-14T23:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising