ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS: శాసన మండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు

ABN, First Publish Date - 2023-03-09T18:59:02+05:30

రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.

BRS MLC candidates Deshapathi Srinivas, K Naveen Kumar and Venkatram Reddy fIles nominations,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా(BRS MLC candidates) దేశపతి శ్రీనివాస్(Deshapathi Srinivas), కుర్మయ్యగారి నవీన్ కుమార్(K Naveen Kumar), చల్లా వెంకట్రామి రెడ్డి(Venkatram Reddy) గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (Chief Minister K Chandrashekhar Rao) ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.

చల్లా వెంకట్రామిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గువ్వల బాల రాజు, పలువురు ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-09T18:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising