Bandi Sanjay: లోక్‌సభలో బండి సంజయ్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్ ఎంపీలు
ABN, First Publish Date - 2023-08-10T17:26:40+05:30
లోక్‌సభలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ప్రసంగానికి బీఆర్ఎస్ ఎంపీలు (Brs MPs) అడ్డు తగిలారు.
న్యూఢిల్లీ: లోక్‌సభలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ప్రసంగానికి బీఆర్ఎస్ ఎంపీలు (Brs MPs) అడ్డు తగిలారు. కేసీఆర్‌ను విమర్శిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు లేచి నిలబడి నినాదాలు చేశారు.
ప్రసంగ సమయంలో బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తెచ్చారు. ఆ సమయంలో బల్లలు చరుస్తూ తోటి బీజేపీ ఎంపీలు మద్దతు పలికారు. ప్రసంగం అనంతరం బండి కూర్చున్న చోటకు వచ్చి సభ్యులు అభినందనలు తెలిపారు. బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగానికి సభలోని సభ్యులు కనెక్ట్ అయ్యారు.
"తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది. తెలంగాణలో రైతులు నాశనం అవుతున్నారు. రాహుల్ గాంధీని చూస్తుంటే గజనీ గుర్తుకువస్తున్నారు. విపక్షం పెట్టిన అవిశ్వాసంతో ఏం జరగదు. BRS నేత నామాకు బండి సంజయ్ సవాల్. నిరంతర విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. BRS వచ్చాక కేటీఆర్ ఆస్తులు 400 రెట్లు పెరిగాయి. కేసీఆర్ కోడలి ఆస్తులు 1800 రెట్లు పెరిగాయి. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం రాలేదు. కాంగ్రెస్, MIM, BRS ఒక్కటయ్యాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు." అని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు.
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఎంపీ బండి సంజయ్ ప్రసంగించారు.
Updated Date - 2023-08-10T17:50:33+05:30 IST