ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Arrest: చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం..

ABN, First Publish Date - 2023-10-08T12:40:09+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu) అక్రమ

వడ్డెపల్లి(వరంగల్): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టు అప్రజాస్వామికమని టీడీపీ పశ్చిమ నియోజక వర్గ ఇన్‌చార్జి ఎండీ. రహీం అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) ఆదేశం మేరకు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ ప్రాంతంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల పాటు టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్‌ లైట్లు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రహీంతో పాటు తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ వరంగల్‌ పార్లమెంట్‌ ప్రెసిడెంట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బోడ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అవినీతి ఎరుగని నేత అని అన్నారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాంలో స్కాం జరిగిందని చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఏపీలో సైకో పాలన కొనసాగుతున్నదని దుయ్యబట్టారు. ఈ కార్య క్రమంలో టీడీపీ రాష్ట్ర, జిల్లా నేతలు బర్ల యాకూబ్‌, కాగితాల జయశంకర్‌, బైరపాక ప్ర భాకర్‌, కటకం కుమారస్వామి, వెలగందుల రవీందర్‌ గుప్త, హరిదాస్యం సురేష్‌, బరిగెల సుధాకర్‌, మహేందర్‌, మామిండ్ల రాము, కలువల మహేందర్‌, మాలగాని మనోహర్‌, నరేష్‌, సతీష్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-08T12:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising