ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chikoti Praveen : ‘ఒవైసీ నా కొడుకులు, బామ్మర్దులు’ అంటూ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-03-31T11:45:28+05:30

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకూ ఆయన కేసినో వ్యవహారంలో వార్తల్లో నిలువగా.. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సంగారెడ్డి : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen Kumar) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకూ ఆయన కేసినో వ్యవహారంలో వార్తల్లో నిలువగా.. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. జహీరాబాద్‌లో రాముని శోభ యాత్రలో చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ (Owaisi) ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. హిందూ ధర్మం గురించి మాట్లాడితే తలలు నరుకుతామన్నారు. క్యాసినో ఆడేటోడు హిందూ ధర్మం గురించి మాట్లాడవద్దా..? అని చికోటి ప్రవీణ్ ప్రశ్నించారు. హిందువులపై కేసులు పెడితే బెయిలు తీసుకువచ్చే బాధ్యత తనదేనంటూ భరోసా ఇచ్చారు.

అసలు చికోటి ప్రవీణ్ ఏం మాట్లాడరనేది ఆయన వ్యాఖ్యల్లోనే.. ‘‘ఒవైసీ నా కొడుకులు, బామ్మర్దులు మాకు 15 నిమిషాలు పోలీసులు లేకుండా ఉంటే మెమెంటో చూపిస్తాం అన్నారు. మీ అంతు చూడటానికి మాకు రెండే రెండు నిమిషాలు చాలు. మా హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడే కొడుకులవి తలలు నరుకుతం. అరేయ్ కొజ్జాల్లారా.. మత మార్పిడి కుక్కల్లారా.. మా జనాభా ఎక్కువగా ఉందని మీరు ఏడుస్తున్నారు... మీకు పెంచుకునే శక్తి లేదా..? మేము పెంచాలా? క్యాసినో ఆడేటోడు హిందూ ధర్మం గురించి మాట్లాడవద్దా..? హిందువులపై కేసులు పెడితే బెయిలు తీసుకువచ్చే బాధ్యత నాది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-31T12:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising