ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

ABN, First Publish Date - 2023-03-21T16:01:52+05:30

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ (Hyderabad Mahbubnagar), జగిత్యాలలో సిట్ అధికారులు సోదాలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ (Hyderabad Mahbubnagar), జగిత్యాలలో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఈ కేసులో నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ (Praveen Rajasekhar), రేణుక ఇళ్లలో సిట్‌ అధికారులు తనిఖీలు చేశారు. మూడు చోట్ల అధికారుల దర్యాపు చేస్తున్నారు. రాజశేఖర్ సొంతూరు జగిత్యాల జిల్లా (Jagtial District) తాటిపల్లికి కూడా అధికారులు వెళ్లారు. రేణుకతో పాటు భర్త నాయక్‌తో కలిసి ముందుగా లంగర్‌హౌస్‌కు వెళ్లారు. సన్‌ సిటీలోని కాళీ మందిర్‌కి వెళ్లి అనుమానితులను ప్రశ్నించారు. రేణుక సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా గండ్వీడ్‌కు సిట్ బృందం వెళ్లింది.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో వాటి పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్ష పేపర్లతోపాటు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల పరిరక్షణ కోసం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఐఏఎస్‌ స్థాయి కస్టోడియన్‌ అధికారిని నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కంట్రోలర్‌ను కూడా నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీలో ప్రస్తుతం కార్యదర్శి పేరిట ఒక ఐఏఎస్‌ అధికారి పోస్టు ఉంది. కొన్ని పరిపాలన వ్యవహారాలను కార్యదర్శి పర్యవేక్షిస్తుండగా, మిగిలిన అనేక పనులు చైర్మన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల భద్రత వంటి అంశాలను నేరుగా చైర్మన్‌ పర్యవేక్షిస్తున్నారు. పని ఒత్తిడి ఉన్న సమయంలో ప్రశ్నపత్రాల భద్రత బాధ్యతలను ఇతర అధికారులకు చైర్మన్‌ బదలాయిస్తున్నారు.

Updated Date - 2023-03-21T16:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising