ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Covid: ‘కరోనా’ వార్డులు సిద్ధం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు

ABN, Publish Date - Dec 22 , 2023 | 10:12 AM

కొవిడ్‌, కొత్త సబ్‌ వేరియంట్‌తో ఎవరైనా వస్తే చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో 50 పడకలను సిద్ధం చేసినట్లు

- గాంధీలో అందుబాటులోకి 50 పడకలు

- ఫీవర్‌, చెస్ట్‌, ఉస్మానియాలోనూ..

- కేసులు పెరిగితే చికిత్సకు సిద్ధం

కరోనా కేసులు పెరిగితే చికిత్స అందించేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది. ఆక్సిజన్‌ పడకలను అందుబాటులోకి తెచ్చారు. టెస్ట్‌ల సంఖ్య కూడా పెంచినట్లు అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌, కొత్త సబ్‌ వేరియంట్‌తో ఎవరైనా వస్తే చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో 50 పడకలను సిద్ధం చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌, మాస్క్‌లు, శానిటైజేషన్‌, డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఐదు పడకలతో ఐసోలేషన్‌ వార్డును సిద్ధం చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు. చెస్ట్‌ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును అందుబాటులో ఉంచారు. ఆ పడకలకు ఆక్సిజన్‌ సదుపాయంతోపాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్‌ మహబూబ్‌ ఖాన్‌ తెలిపారు.

ఫీవర్‌ ఆస్పత్రిలో..

నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు షురూ చేశారు. ఏడు నెలలుగా కరోనా లక్షణాలతో ఎవరూ రాకపోవడంతో అక్కడ పెద్దగా పరీక్షలు చేయడం లేదు. ప్రస్తుతం మళ్లీ కొవిడ్‌ భయంతో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందించేందుకు 20 పడకలతో వార్డును అందుబాటులో ఉంచినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు.

చెస్ట్‌ టు గాంధీ..

ఎర్రగడ్డ, డిసెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ పరీక్షల కోసం శాంపిల్స్‌ గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ తెలిపారు. గురువారం 29 మంది శాంపిల్స్‌ పంపామని, పాజిటివ్‌ వస్తే ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 10:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising