ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CP Ranganath: వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు

ABN, First Publish Date - 2023-04-05T18:04:07+05:30

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay)ఇలా చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay)ఇలా చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) వెల్లడించారు. పరీక్షలను రద్దు చేయించాలనే దురుద్దేశం కనిపిస్తోందని, టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసుపై రెండు రోజుల్లో పూర్తి ఆధారాలు సేకరిస్తామని, సెక్షన్ 41 ప్రకారం వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చని సీపీ స్పష్టం చేశారు.

టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ప్రశాంత్‌, మహేష్‌ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్‌కు పంపారని, బండి సంజయ్‌కు ఉదయం 11.24 గంటలకు క్వశ్చన్‌ పేపర్ చేరిందని సీపీ వెల్లడించారు. ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, అరెస్ట్ సమయంలో బండి సంజయ్‌ తన దగ్గర ఫోన్‌ లేదన్నారని సీపీ చెప్పారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని, బీజేపీలో చాలామందికి పేపర్ షేర్ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం పంపాక ప్రశాంత్ 149 మందితో మాట్లాడాడని, పేపర్ లీక్‌కు ముందు రోజు బండి సంజయ్‌, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. కమలాపూర్‌ స్కూల్ నుంచి పేపర్ బయటకు వచ్చిందన్నారు.

పేపర్‌ లీక్‌ కేసులో మరికొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని, అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం తమకు లేదని, బండి సంజయ్‌ అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని సీపీ తెలిపారు. విచారణలో ఏ2 ప్రశాంత్‌ కూడా నేరాన్ని అంగీకరించాడని, సంజయ్‌ ఫోన్ దొరికి ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేవి అని సీపీ అన్నారు. ప్రశాంత్ పేపర్ బయటకు పంపిన వెంటనే బండి సంజయ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారని, బండి సంజయ్‌ దురుద్దేశంతోనే ఇలా చేసినట్లు నిర్ధారణ అయిందని సీపీ స్పష్టం చేశారు.

టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు. A2గా బూర ప్రశాంత్‌, A3గా మహేష్‌, A4గా బాలుడు, A5గా మోతం శివగణేశ్‌, A6గా పోగు సుభాష్‌, A7గా పోగు శశాంక్, A8గా దూలం శ్రీకాంత్‌, A9గా పెరుమాండ్ల శార్మిక్, A10గా పోతబోయిన వసంత్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.

Updated Date - 2023-04-05T18:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising