CPI Narayana: బండి సంజయ్ మార్పుతో బీజేపీ పనైపోయింది: సీపీఐ నారాయణ
ABN, First Publish Date - 2023-08-30T12:44:32+05:30
అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ - కమ్యూనిస్టులు కలిసి పోటీచేస్తే బీఅరెస్‌కు డిపాజిట్లు కూడా రావని దీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రస్తుతం చర్చల దశలో ఉందని, కలిసి పోటీ చేసే పరిస్థితి వస్తే మాత్రం బీఅరెస్ ఓటమి తధ్యమని అన్నారు.
హైదరాబాద్: అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ - కమ్యూనిస్టులు కలిసి పోటీచేస్తే బీఅరెస్‌కు డిపాజిట్లు కూడా రావని దీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రస్తుతం చర్చల దశలో ఉందని, కలిసి పోటీ చేసే పరిస్థితి వస్తే మాత్రం బీఅరెస్ ఓటమి తధ్యమని అన్నారు. ఓట్ల ప్రాతిపదికన కాకుండా ఒకరికి ఒకరు అవసరం అనే అంశంపై పొత్తులపై చర్చ జరపాలన్నారు. ఇక ఆంధ్రాలో టీడీపీ, కమ్యూనిస్టులు కూటమిగా పోటీ చేస్తే డబుల్ ఇంజన్ సర్కార్ బ్రేక్ అవుతుందన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని అన్నారు. ఎన్నికల కోసమే గ్యాస్ ధర 200 తగ్గించారని, చిత్తశుద్ధి ఉంటే మోదీ హయాంలో రూ.1200లకు పెరిగిన గ్యాస్ ధరను 2014లో ఉన్న ధర కంటే తక్కువకే ఇవ్వాలన్నారు. గ్యాస్ ధరల తగ్గింపు ఆపద మొక్కుల ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు. ఇక ముంబైలో జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి సీపీఐ నుంచి డీ రాజా, బినోయ్ విష్ణోయ్ హాజరవుతారని చెప్పారు.
మోదీ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ వందే భారత్ రైలు స్పీడ్ కంటే వేగంగా పడిపోతుందని సీపీఐ నారాయణ అన్నారు. విదేశాల్లో మోదీ గ్రాఫ్ పెరుగుతుందని, అక్కడ పోటీ చేస్తే మోదీ గెలుస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్‌లో మోదీ ఖ్యాతి తగ్గిందని విమర్శించారు. మోదీ- కేసీఆర్ ఉప్పు నిప్పుగా ఎన్నో మాటలు మాట్లాడారని అన్నారు. గవర్నర్‌ని కేసీఆర్ అటెండర్‌లా చూశారని, ప్రధాని రాష్ట్రానికి వచ్చినవేళ సంప్రదాయాన్ని కాదని ఎందుకు ఎగ్గొట్టారని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి మొట్టికాయలు పడగానే గవర్నర్‌కి బానిసలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. జైల్లో ఉండాల్సిన అవినాష్ రెడ్డి జగన్ ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలను కలవగానే అంత మారిపోయిందన్నారు.
కేసీఆర్, జగన్ పచ్చి అవకాశవాదులు..
శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చాలని ప్లాన్ చేశారని, శరత్ చంద్రరెడ్డి అప్రూవర్‌గా మారితే కవిత జైలుకు పోవాలని అన్నారు. ఒంటరిగా కలవడంలోనే కుట్ర ఉందని, కేసీఆర్ - జగన్ ఇద్దరూ పచ్చి అవకాశవాదులని వ్యాఖ్యానించారు. కవిత విషయంలోనే కేసీఆర్ బీజేపీకి తలొగ్గాడని అన్నారు. కేంద్రానికి మద్దతు ఇస్తామని కేసీఆర్ లొంగిపోయాడని అన్నారు. ఒక్కదెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా వైసీపీ, బీఅరెస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది డబుల్ ఇంజన్ సర్కారేనని, డబుల్ ఇంజన్ సర్కార్‌లో కేసీఆర్ చేరిపోయారని అన్నారు. విభజన హామీల అమలుపై కేంద్రాన్ని ఎందుకు నిలదియ్యడం లేదని ప్రశ్నించారు. అమరావతి అంశం ప్రధాని ప్రతిష్టకు సంబందించిన అంశమని, స్వయంగా ప్రధాని పునాది వేసిన ప్రాజెక్టు అటకెక్కితే ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని అన్నారు. బీజేపీని ఓడించేందుకే బీఅరెస్‌కి మద్దతు ఇచ్చామని చెప్పారు. దానికి తాము చింతించడం లేదని చెప్పారు. కానీ మావాళ్ళు కొంతముందుగానే తెరుకోవాల్సి ఉందన్నారు.
బీజేపీ డైరెక్షన్‌లోనే విపక్షాల సమావేశాలకు హాజరుకాకుండా ఎంఐఎంతో కలిసి మూడో కూటమికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొండపై మద్యం అమ్మకాలు నిషేధం కానీ మద్యం వ్యాపారి అయిన శరత్ చంద్రారెడ్డి లాంటి వ్యక్తికి పాలకమండలిలో చోటు ఎలా కల్పిస్తారు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంలో జైలుకు వెళ్ళిన ఐఏఎస్ అధికారులు చాలామంది ఉన్నారని, మండలిలో దేవుడికి మూడు నామాలు పెట్టేవారు చాలామంది ఉన్నారని నారాయణ ఆరోపించారు.
Updated Date - 2023-08-30T13:24:50+05:30 IST