ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మరింత ఆసక్తిగా స్టేషన్ ఘనపూర్ రాజకీయం.. రాజయ్య నివాసానికి దాస్యం

ABN, First Publish Date - 2023-09-05T12:05:37+05:30

స్టేషన్ ఘనపూర్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటికి ప్రభుత్వ చీఫ్ విప్ హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ వెళ్లారు.

హనుమకొండ :స్టేషన్ ఘనపూర్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటికి ప్రభుత్వ చీఫ్ విప్ హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ వెళ్లారు. రాజయ్య పార్టీ మారతారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇంటికి వినయ్ భాస్కర్ వెళ్లినట్టు తెలుస్తోంది. రాజయ్యను బుజ్జగించినట్టు సమాచారం. వినయ్ భాస్కర్ బుజ్జగింపులకు రాజయ్య మొత్తబడ్డట్టు సమాచారం. పార్టీ మారే ఆలోచనను కూడా రాజయ్య వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం సూచన మేరకే వినయ్ భాస్కర్ రాజయ్య దగ్గరకు వచ్చినట్టు సమాచారం.

ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. పార్టీ విషయాలు మాట్లాడేందుకు రాజయ్య దగ్గరకు వచ్చానన్నారు. రాజయ్య టికెట్ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేసిన నాయకుడు రాజయ్య అని కొనియాడారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వినయ్ భాస్కర్ తెలిపారు.

ఇక తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసమే తాను దామోదర రాజనర్సింహను కలిశానన్నారు. దానిలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజనర్సింహతో భేటీకి రాజకీయ రంగు పులమొద్దని రాజయ్య పేర్కొన్నారు.

Updated Date - 2023-09-05T12:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising