ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deputy CM: ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి

ABN, First Publish Date - 2023-12-05T07:17:18+05:30

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు సహకరించిన ముస్లింలకు డిప్యూటీ

పంజాగుట్ట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు సహకరించిన ముస్లింలకు డిప్యూటీ సీఎం(Deputy CM) పోస్ట్‌తో పాటు నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం ఇవ్వాలని ఆల్‌ ఇండియా ముస్లిం రిజర్వేషన్‌ పోరాట సమితి, ఆల్‌ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్‌ ఫోరం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ షేక్‌ ఇస్లాముద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం జాతీయ అధ్యక్షుడు షేక్‌ సత్తార్‌ సాహెబ్‌, నాయకులతో కలిసి కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లు, హక్కుల కోసం తాము కొంతకాలంగా పోరాడుతున్నామని, కేసీఆర్‌ తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపైకి 10 ప్రశ్నలు సంధించామని, వాటిని ముస్లిం సమాజం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపి, అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కోరామని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ముస్లిం సమాజం స్పందించి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులు ఖలీల్‌ అహ్మద్‌, అబ్దుల్‌ షాహీద్‌, డాక్టర్‌ ఖలీల్‌ అహ్మద్‌, అహన్‌, మజర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T07:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising