ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadagirigutta: యాదగిరీశుడికి బంగారు హారం సమర్పించిన నిజాం వారసులు

ABN, First Publish Date - 2023-02-26T20:16:29+05:30

భక్తజనభాంధవుడు.. ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనారసింహుడు.. ప్రకృతి బీభత్సం నుంచి ఆర్తులను కాపాడేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట: భక్తజనభాంధవుడు.. ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనారసింహుడు.. ప్రకృతి బీభత్సం నుంచి ఆర్తులను కాపాడేందుకు తన చిటికెన వేలుపై గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిపట్టిన ఘట్టం యాదగిరికొండపై సాక్షాత్కారమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పరమాత్ముడు శ్రీకృష్ణభగవాన్‌ తన మహిమాన్విత లీలలను ప్రతిబింబించే దివ్య మనోహరమైన గోవర్ధనగిరిధారి అలంకారంలో లక్ష్మీనరసింహుడు ఆదివారం భక్తజనులను కనువిందు చేశారు. గోవిందనామ స్మరణల మధ్య గోవర్ధనగిరిధారిగా శ్రీకృష్ణుడి అలంకారంలో నారసింహుడిని ఆలయ తిరువీధుల్లో ఊరేగించి.. పడమటి దిశలోని వేంచేపు మండపంలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రివేళ లక్ష్మీనృసింహుడు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

బంగారు హారం సమర్పించిన నిజాం వారసులు

స్వామికి నిజాం వారసులు సుమారు రూ.4లక్షల వ్యయంతో తయారు చేయించిన బంగారు ఆభరణాన్ని కనుకగా అందజేశారు. నిజాం వారసురాలు ప్రిన్సెస్‌ ఎస్రా సుమారు 67 గ్రాముల బరువుగల బంగారు హారాన్ని తయారు చేయించగా, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు ఆదివారం ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత ఈవో గీతారెడ్డికి అందజేశారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం తొలిసారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బంగారు హారాన్ని స్వామికి కానుకగా ఇస్తానని ఆమె కోర్కె మేరకు పంపినట్టు కిషన్‌రావు తెలిపారు. సంప్రోక్షణ పూజలనంతరం బంగారు ఆభరణాన్ని స్వామికి కల్యాణ వేడుకల్లో అలంకరించనున్నట్టు అర్చకులు తెలిపారు.

యాత్రాజనుల కోలాహలం

యాదగిరీశుడి సన్నిధిలో ఆదివారం యాత్రాజనుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు రోజు, వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడంతో యాత్రాజనులు ఇష్టదైవాలను దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. కొండకింద లక్ష్మీఫుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి చేరుకున్న యాత్రీకులు ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్ల గుండా దేవదేవుడి దర్శనాలకు కోసం క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 35వేలుకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2023-02-26T20:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising