ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Harish Rao: డాక్టర్ ప్రీతి మృతి.. నా మనసును తీవ్రంగా కలిచి వేసింది

ABN, First Publish Date - 2023-02-26T21:52:57+05:30

మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి (Doctor Preethi) తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి (Doctor Preethi) తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించిందని మంత్రి చెప్పారు. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలిచి వేసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కన్నుమూసింది. ఐదురోజులుగా నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ కుమార్తె ఇకలేరని తెలుసుకున్న తల్లిదండ్రులు (Preethi Parents) కన్నీరుమున్నీరవుతున్నారు. తోటి స్నేహితురాలు చనిపోవడంతో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు (College Students) శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో (MGM) విధులు నిర్వహిస్తుండేది. ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ASI గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లి వస్తున్నారు. రవీంద్ర మూడో కుమార్తె ప్రీతి.

సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతో విసిగిపోయిన ప్రీతి విషపు తనకు తానుగా ఇంజక్షన్ తీసుకుంది. దీంతో ఆ విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు హుటాహుటిన వరంగల్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎం తరలించగా అంతకంతకూ ప్రీతి ఆరోగ్యం విషమించింది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వరంగల్ (Warangal) నుంచి హైదరాబాద్‌ (Hyderabad) నిమ్స్‌‌ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్‌ (CPR) చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్‌, ఎక్మోపైనే చికిత్స అందించారు. అయితే.. హానికర ఇంజక్షన్ తీసుకోవడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్‌ (Brain)పై ప్రభావం ఎక్కువగా పడుతుందని డాక్టర్లు చెప్పారు. శ్వాస తీసుకోవడంలోనూ ప్రీతి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షించింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్‌ వైద్యులు అన్ని ప్రయత్నాలూ చేశారు. అయితే.. ఐదురోజులుగా ప్రీతిని కాపాడాలని ప్రత్యేక బృందం శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Updated Date - 2023-02-26T21:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising