రసవత్తరంగా డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాలు
ABN, First Publish Date - 2023-04-17T10:15:10+05:30
డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ అవకాశం ఇస్తే డోర్నకల్ నుంచే పోటీ చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
మహబూబాబాద్ : డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ అవకాశం ఇస్తే డోర్నకల్ నుంచే పోటీ చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తానన్నారు. తన ఆప్షన్ అయితే డోర్నకల్లేనని అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది డోర్నకల్ నియోజకవర్గమేనన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో మంత్రి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు డోర్నకల్‌లో పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి. ఇటీవలే తన ఓటమికి కుట్రలు చేస్తున్నారని పరోక్షంగా రాథోడ్‌ను ఉద్దేశించి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇద్దరూ బీఆర్ఎస్కు చెందిన నేతలే కావడంతో పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-04-17T10:15:10+05:30 IST