ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandanrao: సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై దుబ్బాక ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-01T14:26:09+05:30

సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) మహారాష్ట్ర పర్యటనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Dubbaka MLA Raghunandanrao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన మోరాంచపల్లికి సీఎం వెళతారనుకుంటే... మహారాష్ట్రకు వెళ్లారని మండిపడ్డారు. మోరంచపల్లి ప్రజలు దీనావస్థలో ఉన్నారని.. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. తొమ్మిదేళ్లలో పాతబస్తీకీ 5.5 కిలో మీటర్ల మెట్రో లైన్ పూర్తి చేయడం ప్రభుత్వానికి చేతకాలేదన్నారు. నాలుగేళ్లలో మెట్రో రైలును భాగ్యనగరం చుట్టూ విస్తారింపచేస్తామని చెప్పడాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ ను పెంపొందించేందుకు భాగ్యనగరం చుట్టూ మెట్రో అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. కేసీఆర్‌కు ఓట్లు సీట్లు తప్ప వేరే ధ్యాస లేదని ఎమ్మెల్యే విమర్శించారు.

కడెం ప్రాజెక్టు (kadem Project) అభివృద్ధి కోసం కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంది ప్రభుత్వమని.. కడెం ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రులకు సమయం లేకపోవడం దురదృష్టకరమన్నారు. కడెం ప్రాజెక్టు అభివృద్ధికీ ముఖ్యమంత్రి వద్ద 30 శాతం నిధులు లేవని తెలిపారు. ఒక్క నెలలోనే మూడు రకాల పరీక్షలు పెట్టి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. మంత్రివర్గ సమావేశంలో పరీక్షల నిర్వహణ తేదీల మార్పుపై నిర్ణయం తీసుకుంటారనుకున్నామన్నారు. ఐదు గంటల పాటు జరిగిన చిట్ట చివరి మంత్రివర్గ సమావేశంలో ఏమీ చర్చించారని ప్రశ్నించారు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని.. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు కేటీఆర్ గొప్పగా చెప్పారన్నారు. ఆర్టీసీ ఆసుపత్రి బకాయిలు ముందు చెల్లించాలని హితవుపలికారు. ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఆర్టీసీ భూములను లీజుకు ఇవ్వాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పోటీ పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల ఒక నెల జీతాన్ని వరద బాధితుల కోసం ఇవ్వాలన్నారు. ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర నుంచి వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోవాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-01T14:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising