ED: కవితను గంటల తరబడి ప్రశ్నిస్తోన్న అధికారులు.. ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్..
ABN, First Publish Date - 2023-03-20T19:35:59+05:30
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు 8 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు 8 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం కవిత ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఈడీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలను ఈడీ అధికారులు తీసుకుంటున్నారు.
కవితను ఈ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు (ED Officers) విచారిస్తున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలియవచ్చింది. కవిత, అరుణ్ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. సాయంత్రం 6 గంటలు అయినా ఇంతవరకూ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటికి రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. మొదటిసారి కవితను విచారించినప్పుడే సాయంత్రం 6 గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే రెండోరోజు విచారణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అసలు ఈడీ కార్యాలయంలో ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇటు.. ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు.
Updated Date - 2023-03-20T19:39:23+05:30 IST