ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heart Attack: గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. గుండెపోటు రావడానికి కారణం ఇదే..

ABN, First Publish Date - 2023-03-03T20:04:12+05:30

గుండెపోటుతో (heart attack) ఇంజినీరింగ్ విద్యార్థి విశాల్ (engineering student Vishal) మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మేడ్చల్: గుండెపోటుతో (heart attack) ఇంజినీరింగ్ విద్యార్థి విశాల్ (engineering student Vishal) మృతి చెందారు. చికిత్స కోసం సీఎంఆర్ (CMR) తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి విశాల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విశాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో లేకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇటీవల కాలంలో గుండె పోటు మరణ వార్తలు అధికంగా వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. తీరా ఇదేంటని చూస్తే గుండెపోటు అని తెలుస్తోంది. గుండె పోటుకు గురైనవారిని సీపీఆర్‌ చేసి బతికించవచ్చని చాలా మందికి తెలియని విషయం. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నిత్యం ప్రజల మధ్యలో ఉండే కొన్ని శాఖల సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముందుగా అన్ని జిల్లాల నుంచి కొంత మంది వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకురావడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఐదుగురు వైద్యులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. అందులో కోత్లాబాద్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నరేష్‌, మిడ్జిల్‌ పీహెచ్‌సీ నుంచి డాక్టర్‌ మను ప్రియ, దేవరకద్ర నుంచి డాక్టర్‌ శరత్‌చంద్ర, జానంపేట పీహెచ్‌సీ నుంచి డాక్టర్‌ శభానా, జడ్చర్ల పీహెచ్‌సీ శివకాంత్‌ ఉన్నారు. వీరందరికి జీవీకే ఈఎంఆర్‌ఐ నుంచి ఇటీవల శిక్షణ ఇచ్చారు.

ప్రస్తుతం చాలా మంది సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌(సీఎస్‌ఏ)కు గురవుతున్నారు. ఇలాంటి వారిలో 10 మందిలో ఒక్కరే ప్రాణాలతో బయటపడుతున్నారు. కార్డియాక్‌ అరెస్ట్‌ అయిన వారికి సీపీఆర్‌( కార్డియో పల్మనరి రిసుసిటేషన్‌, డిఫిబ్రిలేటర్‌ వెంటనే అందిస్తే 10 మందిలో ఐదుగురిని రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల చాలానే జరిగాయి. ఈ సీపీఆర్‌ చేసే ముందు సీఎస్‌ఏకు గురైన వ్యక్తిని పక్కకు జరిపి పడుకోబెట్టాలి. పక్కన ఉండే వారు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయాలి. ఆ తర్వాత తట్టి పిలిచి చూడాలి. లేవకపోతే గుండె చప్పుడు గమనించాలి. ఆ తర్వాత సీపీఆర్‌ మొదలుపెట్టాలి. రెండు నిమిషాలు ఇలాచేయాలి. ఆ రెండు నిమిషాలలో ప్రతీ 30 సార్లకు ఒకసారి నోటి నుంచి శ్వాస అందించాలి. ఇలా రెండు నిమిషాల చొప్పున ఐదు సార్లు చేయాలి. అంబులెన్స్‌ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి.

Updated Date - 2023-03-03T20:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!