ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana polls: పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

ABN, First Publish Date - 2023-11-30T07:28:02+05:30

Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే, కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. సిద్దిపేటలోని అంబి టస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నేం. 118 లో ఈవీఎం మోరాయించింది.

Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే, కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. సిద్దిపేటలోని అంబి టస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నేం. 118 లో ఈవీఎం మోరాయించింది. అలాగే మాక్ పోలింగ్ సజావుగా సాగినా, పోలింగ్ ప్రారంభం కాగానే ఇన్ వాలిడ్‌గా చూపుతున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బూత్ నెంబర్ 89లో ఇలాగే ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటు వేయడానికి వచ్చిన సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వేచి చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేట మండల కేంద్రంలో ఉన్న 167 పోలింగ్ బూత్‌లో ఇలాగే ఈవీఎం మొరయించింది. దాంతో అక్కడ ఇంకా మాక్ పోలింగ్ మొదలు కాలేదని తెలిసింది. ఇక పోలింగ్ మొదలు కాకపోవడంతో ఓటర్లు వేచి చూస్తున్నారు.

అలాగే నాగార్జునసాగర్ 103 పోలింగ్ బూత్‌లో కూడా ఈవీఎం మొరాయించింది. దీంతో పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మోరాయించడంతో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇక జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్లో ఈవీఎం మొరాయించడంతో హీరో అల్లు అర్జున్ లైన్లోనే వెయిట్ చేస్తున్నారు. హనుమకొండ పరిధిలోని మర్కజీ స్కూల్‌లో ఓ ఈవీఎం మొరాయించడంతో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. 

Updated Date - 2023-11-30T07:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising