E-racing: ఫార్ములా-ఈ రేసింగ్ ప్రాక్టీస్ వాయిదా.. కానిస్టేబుల్ అరెస్ట్
ABN, First Publish Date - 2023-02-10T17:45:55+05:30
ఫార్ములా-ఈ రేసింగ్ (E-racing) ప్రాక్టీస్ వాయిదా పడింది. ట్రాక్‌పై గందరగోళంతో ప్రాక్టీస్ వాయిదా పడింది. ట్రాక్‌పైకి సాధారణ వాహనాలు రావడంతో వాయిదా పడింది...
హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసింగ్ (E-racing) ప్రాక్టీస్ వాయిదా పడింది. ట్రాక్‌పై గందరగోళంతో ప్రాక్టీస్ వాయిదా పడింది. ట్రాక్‌పైకి సాధారణ వాహనాలు రావడంతో వాయిదా పడింది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు వచ్చిన సాధారణ వాహనాలు వచ్చాయి. సాధారణ వాహనాలు ఎలా వచ్చాయని నిర్వాహకులు టెన్షన్ పడ్డారు. ప్రాక్టీస్ జరుగుతున్న సమయంలో సాధారణ వాహనాలను అనుమతించిన కానిస్టేబుల్ (Constable)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ జరుగుతుండడంతో మంగళవారం నుంచి సాగర తీరం చుట్టూ (ట్యాంక్‌బండ్ మినహా) వాహనాలను మళ్లించి ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి ఈవెంట్ కావడంతో ఆ స్థాయిలోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి కార్ రేస్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులతోపాటు పోటీల్లో పాల్గొనేందుకు పలు సంస్థలు, రేసర్లు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ఈ-రేసింగ్‌కు సర్వం సిద్ధం
దూసుకుపోయే ఫార్ములా-1 కార్ రేసింగ్‌ను అప్పట్లో టీవీలలో తప్ప భారత క్రీడాభిమానులు ప్రత్యక్షంగా చూసి ఎరుగరు. కానీ దశాబ్దం కిందట స్పోర్ట్స్ ఫ్యాన్స్ (Sports fans)కు ఆ కార్ల పరుగులను ప్రత్యక్షంగా తిలకించే చాన్స్ లభించింది. 2011 నుంచి వరుసగా మూడేళ్లపాటు నోయిడాలోని బుద్ధ సర్క్యూట్(Buddha Circuit)పై ఇండియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ వరల్డ్ చాంపియన్‌షిప్ (Championship) జరిగింది. సెబాస్టియన్ వెటెల్ తదితర దిగ్గజ రేసర్ల డ్రైవింగ్ విన్యాసాలను చూసి మన క్రీడాభిమానులు అచ్చెరువొందారు. అయితే కొన్ని కారణాలతో 2014 నుంచి ఇండియన్ గ్రాండ్ ప్రీ నిర్వహించలేదు. ఇక సీన్ కట్ చేస్తే ఆ స్థాయి కాకపోయినా.. అంతర్జాతీయ మోటార్ కార్ రేసింగ్ సంస్థ (ఎఫ్‌ఐఏ) ఎలక్ట్రికల్ కార్లతో తొలిసారి ఫార్ములా ఈ-వరల్డ్ చాంపియన్‌షిప్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. రేస్‌ను 20వేల మంది ఫ్యాన్స్ తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పోటీలకు సర్వం సిద్ధమైంది.
ట్రాఫిక్ జామ్
ఫార్ములా ఈ-రేస్ కారణంగా ఎన్టీఆర్ మార్గ్ చుట్టూరా రోడ్లు మూసివేయడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం, ఈ రోజు ఖైరతాబాద్, లక్డీకపూల్, ఆర్బీఐ రోడ్డు, లిబర్టీ, ట్యాంక్ బండ్, బషీరాబాద్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. అలాగే ఫార్ములా ఈ-రేస్ కారణంగా ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వంతెన, పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్డు మూసివేయడంతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. 10 నుంచి 15 నిమిషాలు పట్టే ప్రయాణానికి 40 నిమిషాల నుంచి గంట సమయం పడుతోంది. ట్రాఫిక్ మళ్లింపుల ప్రభావం పంజాగుట్ట నుంచి లక్డీకాపూల్, లక్డీకాపూల్ టు మెహిదీపట్నం మార్గాల్లోనూ కనిపిస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్ చౌరస్తాల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వాహనాల మళ్లింపులో ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తోన్న నిర్ణయాలు సమస్య తీవ్రతను పెంచుతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-02-10T18:17:05+05:30 IST