ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Breaking: బీబీనగర్ దగ్గర పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

ABN, First Publish Date - 2023-02-15T06:54:02+05:30

విశాఖ (VSP) నుంచి హైదరాబాద్ (HYD) వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express) బుధవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. హైదరాబాద్ నగర శివారులోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విశాఖ (VSP) నుంచి హైదరాబాద్ (HYD) వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express) బుధవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. హైదరాబాద్ నగర శివారులోని బీబీనగర్‌ దగ్గర గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. ఎస్‌5 బోగీని వదిలి గోదావరి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్ వెళ్లింది. ఉదయం 5.30 నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి, బీబీనగర్‌, ఘట్‌కేసర్‌ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపేయాల్సి వచ్చింది. ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.

విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తుండే విషయం తెలిసిందే. విశాఖలో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు నాంపల్లి స్టేషన్‌లో గమ్య స్థానానికి చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు తెల్లవారుజామున 5.15కి చేరుకునే ఈ రైలులో కొన్ని వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

ఇటీవల కిరండోల్‌ పాసింజర్‌ రైలుకు పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. జనవరి 17న ఉదయం 9.40 గంటల సమయంలో అరకు సెక్షన్‌ పరిధిలోని శివలింగాపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో గల ఏడో నంబర్‌ టన్నెల్‌ వద్ద ఈరైలు పట్టాలు తప్పింది. వెనుక నుంచి ఆరో బోగీ చక్రాలు పట్టాలు తప్పగా.. చివరిలో ఉన్న రెండు విస్టాడోమ్‌ కోచ్‌లు టన్నెల్‌లోనే ఉండిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై బోగీల నుంచి కిందకు దిగిపోయారు.

రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన ఆరో బోగీ నుంచి వెనుక గల బోగీల్లోని ప్రయాణికులను ముందున్న 11 బోగీల్లోకి మార్చారు. ఈ 11 బోగీలతో రైలు ముందుకు కదిలింది. మధ్యాహ్నం రెండు గంటలకు రైలు అరకులోయ చేరుకుంది. దీంతో కిరండోల్‌ వరకూ వెళ్లాల్సిన పాసింజర్‌ను అరకు వరకే పరిమితం చేశారు

Updated Date - 2023-02-15T07:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising