ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీకి గుడ్‌బై?

ABN, First Publish Date - 2023-03-29T14:38:12+05:30

నగరం మధ్యలో.. హిందూ, ముస్లింలు అధికంగా ఉన్న అంబర్‌పేట నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బర్కత్‌పుర, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): నగరం మధ్యలో.. హిందూ, ముస్లింలు అధికంగా ఉన్న అంబర్‌పేట నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గతంలో రెండు పర్యాయాలు అంబర్‌పేట నుంచి గెల్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఘనవిజయం సాఽధించారు. సీనియర్‌ నేత కావడంతో ప్రధాని మోదీ కేంద్రమంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించారు. దీంతో కిషన్‌రెడ్డి నాటి నుంచి కేంద్రమంత్రిగా సమర్థంగా విధులు నిర్వర్తిస్తూనే రాష్ట్ర బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి అడుగులు అసెంబ్లీ వైపా లేక పార్లమెంట్‌ వైపా.. అని జోరుగా చర్చ సాగుతున్నది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే కేంద్రమంత్రి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని బలమైన ప్రచారం జరుగుతోంది. తొలుత సతీమణి కావ్యారెడ్డిని అంబర్‌పేట నుంచి పోటీ చేయించాలని భావించారు. ఎంపీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని బీజేపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసెంబ్లీ వైపే అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆయన కొంతకాలంగా నియోజకవర్గంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. క్రీడా పోటీల ద్వారా స్థానికులతో మమేకమవుతున్నారు. ఒకవేళ కిషన్‌రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయకపోతే ఎవరు పోటీలో ఉంటారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

ఎమ్మెల్యే టు కేంద్రమంత్రి

మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ చేతిలో స్వల్ప మెజార్టీ (1087 ఓట్లు)తో ఓడిపోయారు. అయిదు నెలలకే పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. మోదీ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా, ప్రస్తుతం పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్‌రెడ్డి సీఎం రేసులో ఉంటారని స్థానికంగా ప్రచారం నడుస్తోంది. సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర కేబినెట్‌ మంత్రి స్థాయికి ఎదిగిన కిషన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను అంతగా పట్ట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. పూర్వ హిమాయత్‌నగర్‌, అంబర్‌పేట నియోజకవర్గాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కార్యకర్తలను విస్మరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. దళితబంధు, ఇతర పథకాల ఆశ చూపి బీజేపీ నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నా కిషన్‌రెడ్డి ఇవేమీ పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకుల్లో కొందరు అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసే పక్షంలో కిషన్‌రెడ్డి పార్టీ క్యాడర్‌ పటిష్ఠతపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-29T14:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising