Hail Rain: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగండ్ల వర్షం
ABN, First Publish Date - 2023-04-06T19:32:55+05:30
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా (Kumuram Bheem Asifabad District)లో గురువారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం (Hail rain) బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం రెండు గంటల..
ఆసిఫాబాద్: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా (Kumuram Bheem Asifabad District)లో గురువారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం (Hail rain) బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెనుగాలులతో కూడిన వర్షం కురియడంతో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గంటపాటు జనజీవనం స్తంభించిపోయింది. పెనుగాలుల దాటికి విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటపాటు రాళ్లతో కూడిన వర్షం కురియడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడిపారు. మరోవైపు జిల్లాలోని సిర్పూర్(టి)లో వడగండ్ల బీభత్సానికి విద్యుత్స్తంభాలు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు గాలికి లేచిపోయాయి. కాగజ్నగర్ (Kagaznagar) పట్టణంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం నిలిచిపోయిన తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ట్రాన్స్కో సిబ్బంది చర్యలు ప్రారంభించారు. వడగండ్ల వర్షం వల్ల సంబంధించి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-04-06T19:32:55+05:30 IST