ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Secretariat: 6 ఫ్లోర్లలో భారీ నష్టం.. మాక్‌డ్రిల్‌గా చిత్రించే యత్నం ఆయనదేనా..!

ABN, First Publish Date - 2023-02-03T12:21:40+05:30

నూతన సచివాలయంలో తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే దీనిని మాక్ డ్రిల్‌గా చిత్రీకరించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. కానీ మాక్ డ్రిల్‌కు అంతటి దట్టమైన పొగలు రావడమేంటనేది సందేహంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : నూతన సచివాలయం (New Secretariat) తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన విషయం తెలిసిందే. అయితే దీనిని మాక్ డ్రిల్‌ (Mock Drill)గా చిత్రీకరించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. కానీ మాక్ డ్రిల్‌కు అంతటి దట్టమైన పొగలు రావడమేంటనేది సందేహంగా మారింది. మొత్తానికి మసి పూసి మారేడు కాయ చేస్తున్నారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. 11 ఫైర్ ఇంజిన్లు (Fire Engines) వచ్చి మంటలను అదుపు చేశాయంటే ప్రమాద తీవ్రత ఎంతుదనేది స్పష్టంగా అర్ధమవుతోంది.

ఒకవైపు నూతన సచివాలయ ప్రారంభానికి సీఎం కేసీఆర్ (CM KCR) పుట్టిన రోజున అంటే ఈ నెల 17న ముహూర్తం ఖరారైంది. తాజా అగ్ని ప్రమాద ఘటనతో అధికారులు అయోమయంలో పడ్డారు. కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం సంభవించిన ఫ్లోర్‌లను అధికారులు బృందం పరిశీలించింది. అగ్ని ప్రమాద తీవ్రతను అధికారుల బృందం అంచనా వేస్తోంది. దాదాపు ఆరు ఫ్లోర్లలో భారీగా అస్తి నష్టం సంభవించనట్టు సమాచారం. ఇప్పటి వరకూ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాకపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నట్టు సమాచారం.ఇప్పటికే అగ్ని ప్రమాద ఘటనపై విపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డే అలా చెప్పమన్నారా?

కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం సంభవించిందని తెలిసినా కూడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి (Minister Prashanth Reddy) అడ్రస్ లేరు. సాధారణ సమయంలో రోజూ అధికారులతో సమీక్షించిన ప్రశాంత్‌రెడ్డి.. ప్రమాదం జరిగిన రోజు మాత్రం అటు వైపు కూడా చూడలేదు. పైగా అగ్ని ప్రమాదాన్ని మాక్ డ్రిల్‌గా చిత్రీకరించాలని ఆయనే అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫైర్‌ సేఫ్టీ జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తప్పిదాలను.. ఎలా కప్పిపుచ్చుకోవాలనే యోచనలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2023-02-03T12:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising